E-Paper
Advertisement

దుబాయ్ క్యాన్సిల్.. ముంబైలోనే బన్నీ ‘రాకా’ రచ్చ!

దుబాయ్ క్యాన్సిల్.. ముంబైలోనే బన్నీ ‘రాకా’ రచ్చ!
Advertisement

RAAKA Update: ‘రాకా’.. ‘రాకా’.. ‘రాకా’.. దేశం మొత్తం ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. పుష్ప సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు స్కై లెవెల్‌కి వెళ్లిపోయాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కళ్లు కాసేలా ఎదురుచూస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.

ముంబైలో శరవేగంగా షూటింగ్

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జోరుగా పరుగులు పెడుతోంది. అయితే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం కీలక యాక్షన్ ఎపిసోడ్లు, కొన్ని హై వోల్టేజ్ సీన్స్‌ను దుబాయ్‌లో షూట్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూల్‌ను పూర్తిగా రద్దు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

కానీ షూటింగ్‌కు ఎలాంటి బ్రేక్ పడకుండా, దుబాయ్‌లో తీయాల్సిన సీన్స్ కోసం ముంబైలోనే భారీ సెట్లను నిర్మించి అదే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని సమాచారం.

హాలీవుడ్ రేంజ్‌లో భారీ సెట్లు

ఇక ఈ సెట్లు సాధారణ సినిమా సెట్లు కాదని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో నిర్మిస్తున్నారని ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్.ఫారిన్ లొకేషన్లలో షూట్ చేసిన ఫీల్ వచ్చేలా ప్రతి చిన్న డీటెయిల్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు యూనిట్‌ను తరలించే టైం, ఖర్చు రెండూ తగ్గించడంతో పాటు షూటింగ్‌ను స్పీడ్‌గా పూర్తి చేయడమే ఈ ప్లాన్ వెనుక అసలు కారణమని తెలుస్తోంది.

ముంబై సెట్స్‌లో జాయిన్ అయిన అల్లు అర్జున్

Advertisement

కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో వెకేషన్ ముగించుకుని వచ్చిన అల్లు అర్జున్, హైదరాబాద్‌లో అభిమానులను కలిసిన తర్వాత నేరుగా ముంబై సెట్స్‌లో జాయిన్ అయ్యారు.ప్రస్తుతం ఆయనపై భారీ యాక్షన్ బ్లాక్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్, బన్నీ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో మరోసారి భారీ హంగామా ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో కనిపిస్తోంది.

దీపికా షూటింగ్ ఇప్పటికే పూర్తి?

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇక ఆమెకు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం.ఆమె వ్యక్తిగత షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని అట్లీ ముందుగానే ప్లానింగ్ చేసి ఆమె పార్ట్‌ను పూర్తి చేయడం యూనిట్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో ప్రస్తుతం మిగిలిన ముఖ్యమైన సీన్స్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

వీఎఫ్‌ఎక్స్‌తో హాలీవుడ్ ఫీల్

‘రాకా’కు మరో పెద్ద హైలైట్ విజువల్ ఎఫెక్ట్స్ అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియో పనిచేస్తోందని, అందుకు తగ్గట్టుగానే ముంబైలో ప్రత్యేక సౌండ్ స్టేజ్‌ను ఏర్పాటు చేశారట.

భారీ గ్రీన్ మ్యాట్ సెటప్‌లు, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, హైఎండ్ కెమెరాలు, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో షూటింగ్ కొనసాగుతోందని సమాచారం. అందుకే ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో కనిపించేలా అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.

also read :రణ్‌వీర్ సినిమా దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ రికార్డులన్నీ షేక్!

 బడ్జెట్ వెయ్యి కోట్లను టచ్ చేస్తుందా?

ఇక బడ్జెట్ విషయానికి వస్తే, మొదట అనుకున్న వ్యయం కంటే ఇప్పుడు సినిమా ఖర్చు చాలా పెరిగిందని బీ-టౌన్‌లో వినిపిస్తున్న టాక్. చూడాలి మరి… 700 కోట్ల బడ్జెట్ అంటూ బరిలోకి దిగిన సన్ పిక్చర్స్, వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందో లేదో!

Tags

Related News

మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?

రణ్‌వీర్ సినిమా దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ రికార్డులన్నీ షేక్!

“విశ్వనాథ్ అండ్ సన్స్” ట్రైలర్ చూశారా..? చివర్లో ట్విస్ట్ అదిరిపోయింది!

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!

తండ్రి మరణంపై పూర్ణ ఎమోషనల్ పోస్ట్!

చిన్న డైలాగ్.. పెద్ద దుమారం.. ఇదే సోషల్ మీడియా మ్యాజిక్!

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!

Big Stories

Advertisement
×