E-Paper
Advertisement

దళపతి బర్త్ డే ట్రీట్… ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన విజయ్ టాప్ 5 మూవీస్ ఇవే

దళపతి బర్త్ డే ట్రీట్… ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన విజయ్ టాప్ 5 మూవీస్ ఇవే
Advertisement

Vijay Best Movies : తమిళ ఇండస్ట్రీలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వందల కోట్ల బిజినెస్ చేసే స్టార్ హీరోలలో దళపతి విజయ్ కూడా ఒకరు. రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయినా, అతని సినిమాల మీద ఫ్యాన్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. జూన్ 22న ఆయన బర్త్‌డే సందర్భంగా, ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న విజయ్ టాప్ 5 సూపర్ హిట్ చిత్రాలను, అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

1. కత్తి (Kaththi)- JioHotstar

ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ డ్యూయల్ రోల్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కత్తి’. కార్పొరేట్ శక్తులు రైతుల భూములను ఎలా లాక్కుంటున్నారనే సెన్సిటివ్ అంశంపై సాగే ఈ చిత్రం క్లైమాక్స్ ప్రెస్ మీట్ స్పీచ్ ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ సోషల్ మోనోలాగ్‌ల్లో ఒకటి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించారు.

2. మాస్టర్ (Master) – Prime Video

Advertisement

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మాస్టర్’. విజయ్ ఆల్కాహాలిక్ ప్రొఫెసర్‌ గా డిఫరెంట్ షేడ్‌ లో కనిపించగా, విజయ్ సేతుపతి ‘భవాని’గా భయంకరమైన విలన్ అవతారంలో మెరిశాడు. హీరో vs విలన్ డైనమిక్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను స్పెషల్ చేశాయి.

3. గిల్లి (Ghilli) – Sun NXT

మహేష్ బాబు ‘ఒక్కడు’కి రీమేక్ గా వచ్చింది ‘గిల్లీ’, విజయ్ తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ స్టేటస్ తెచ్చారు. విజయ్-త్రిష కెమిస్ట్రీ, ప్రకాష్ రాజ్ విలనిజం ఇప్పటికీ ఫ్రెష్‌ గా ఉంటాయి. 2024లో రీ-రిలీజ్ అయి ఏకంగా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది ఈ మూవీ.

4. లియో (Leo) – Netflix

Advertisement

దళపతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కాశ్మీర్‌లో సాధారణ కేఫ్ ఓనర్‌ గా జీవించే వ్యక్తి గత జీవితం ఏమిటనే మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. హాలీవుడ్ చిత్రం ‘ఎ హిస్టరీ ఆఫ్ వయలెన్స్’ ఆధారంగా తీసిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసింది.

5. వారసుడు (Vaarasudu / Varisu) – ప్రైమ్ వీడియో

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్, రష్మిక మందన్న, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, జయసుధ తదితరులు నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. వ్యాపార సామ్రాజ్యం వారసత్వం కోసం జరిగే కుటుంబ సంఘర్షణలు, ఎమోషన్స్, యాక్షన్ కలిపి ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలిపాయి. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం విజయ్ కెరీర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.

Tags

Related News

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ

ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

రిసార్ట్‌కు రిలాక్స్ అవ్వడానికెళ్తే ఇదేం ట్విస్ట్ భయ్యా… ఊహించని క్లైమాక్స్

పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

ఇది రివెంజ్ కాదు ఊచకోత… తండ్రి కోసం కొడుకు బ్లడీ బ్లడ్ బాత్… ఈ థ్రిల్లర్ మిస్ అవ్వొద్దు

8 ఏళ్ల బాబు చెప్పిన కథలు విని పోలీసులే షాక్… చివర్లో వచ్చే ట్విస్ట్ కి దిమాక్ కరాబ్

తరతరాలుగా వెంటాడే శాపం… ఆ ఇంటి తలుపు తెరిచిన క్షణం నుంచే అసలు హారర్

Big Stories

Advertisement
×