Anil Ambani: ప్రముఖ బిజినెస్‌మేన్ అనిల్ అంబానీకి ఊహించిన షాక్ తగిలింది. ఆయనకు చెందిన కంపెనీలపై గురువారం ఉదయం నుంచి ఈడీ సోదాలు మొదలు పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సోదాలు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీతోపాటు ఆయా కంపెనీలున్న దాదాపు 35 స్థలాలకు చెందిన 50 కంపెనీలు, 25 మందికి పైగా వ్యక్తులపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ ఎందుకు దాడులు చేస్తోంది? 2017-19 మధ్యకాలంలో ఎస్ బ్యాంక్ నుంచి మంజూరైన రూ.3,000 కోట్ల విలువైన రుణాలను షెల్ కంపెనీల ద్వారా ఇతర గ్రూపులకు మళ్లించినట్టు ప్రాథమిక దర్యాప్తు తేలింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేయడం సోదాలు చేయడం మొదలుపెట్టింది.
ఈడీ తెలిపిన వివరాల మేరకు బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ఇతర ప్రభుత్వ సంస్థలను మోసం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని మళ్లించడానికి ప్లాన్ వేసినట్లు ED ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో ఎస్ బ్యాంక్స్ లిమిటెడ్ ప్రమోటర్‌తో సహా బ్యాంకు అధికారులకు లంచం ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పాయి.
సీబీఐ దాఖలు చేసిన రెండు FIR లు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్-NHB, SEBI, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ-NFRA, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ సోదాలు చేసినట్టు సమాచారం.
ALSO READ: మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇప్పటికే అనిల్ అంబానీని ఫ్రాడ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐ సహా మిగతా బ్యాంకుల నుంచి దాదాపు రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయా నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని, ఈ విషయాన్ని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్ నడుచుకున్నట్టు పేర్కొంది.
Subsequent to recording of FIRs by CBI , ED started investigating the alleged offence of Money Laundering by RAAGA Companies (Reliance Anil Ambani Group Companies). Other agencies & institutions also shared information with ED, such as- The National Housing Bank, SEBI, National…
— ANI (@ANI) July 24, 2025