Sai Durga Tej : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన దర్శకులలో దేవకట్ట ఒకరు. వెన్నెల సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్ట, ప్రస్థానం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ అయిన వెంటనే చాలామందికి అందరిలాంటి దర్శకుడు కాదు అనే క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత తీసిన ఆటోనగర్ సూర్య సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
తన సినిమాలతో సమాజాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాడు దేవకట్ట. తన ఆలోచనలు ఎప్పుడు చాలా ఉన్నతంగా ఉంటాయి. అది అతను సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే దేవ కట్టకి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం దేవకట్ట చేస్తున్న సిరీస్ మయసభ. ఆగస్టు 7న ఈ సిరీస్ సోనీ లీవ్ లో విడుదల కానుంది. తరుణంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పెట్టారు. ఈ ఈవెంట్ కు సాయితేజ్ హాజరయ్యారు.
రిపబ్లిక్ సినిమాపై తేజ్ ఎమోషనల్
ఆటోనగర్ సూర్య సినిమా విడుదలైనప్పుడు నేను దేవకట్ట గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నా గురించి సో అండ్ సో సంథింగ్ అని పరిచయం చేసుకున్నాను. ఆటోనగర్ సూర్య సినిమాలో ఆయన వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆయన నేను జిమ్ లో పరిచయం అయ్యాం. చాలా రోజుల తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాం. నేను ఆయనను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. సార్ నాకోసం ఒక సినిమా చేయండి ప్లీజ్ అని చాలా సార్లు అడిగాను. అయితే ఐఏఎస్ ఆఫీసర్ కథ ఒకటి ఉంది అంటూ మాట్లాడారు. వెంటనే తేరుకొని ఇది మయసభ ఈవెంట్ కదా సారీ ఆ కథను చెప్పేస్తున్నాను అన్నారు. వెంటనే దేవకట్ట మాట్లాడుతూ ఆ కథను చెప్పిన పర్లేదు మయసభ కథ చెప్పకుండా ఉంటే చాలు అని చెప్పారు.
పదేళ్ల క్రితం కథ
రిపబ్లిక్ సినిమా విషయంలో సాయికుమార్ గారితో ప్రత్యేకంగా డైలాగ్స్ చెప్పించారు అని కూడా సాయి తేజ్ తెలిపారు. అలానే ఆ సినిమా క్లైమాక్స్ విషయంలో నాకు నచ్చిన క్లైమాక్స్ పెడదామని తన వాయిస్ రైజ్ చేశారు. అప్పట్లో నేనెంతగా మాట్లాడలేకపోయే వాడిని అంటూ చెప్పారు. ఇకపోతే మయసభ సినిమా కథ కూడా దాదాపు 10 ఏళ్ల క్రితమే దేవకట్ట దగ్గర ఉంది అనే విషయాన్ని రివీల్ చేశారు. అయితే నేను దీనికోసం ఆడిషన్ కూడా ఇస్తాను అని అప్పట్లో చెప్పేవాడిని. అంటూ సినిమా యూనిట్ కి తన విషెస్ తెలియజేశారు.
Also Read: Sai Durga Tej : ఆ వెబ్ సిరీస్ చూసి నన్ను తగులుకున్నారు, మీడియా గురించి మా అమ్మ భయం