Sai Pallavi: సాయి పల్లవి..ఈ పేరు వినగానే తెరపైన ఎమోషన్స్ ఇంత అద్భుతంగా కనిపిస్తాయో, నిర్మాతలు, దర్శకుల ముందు ఈ అమ్మడు పెట్టే రిస్ట్రిక్షన్స్ కూడా అంత స్ట్రిక్ట్ గా కనిపిస్తాయి.ఎందుకంటే బడా సినిమాలు, భారీ రెమ్యూ నరేషన్లు కన్నా నా సొంత రూల్స్ ముఖ్యం అనుకునే రకం మరి.మలర్ భామగా ఎంట్రీ ఇచ్చి భానుమతిగా పాతుకుపోయిన ఈ అమ్మడు తాజాగా కిస్సింగ్ సీన్లపై ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
ఎప్పుడైనా లిప్‌లాక్ సీన్లు ఆఫర్ వచ్చాయా?
విషయంలోకి వెళ్తే ఒక యాంకర్ మీకు ఎప్పుడైనా లిప్‌లాక్ సీన్లు ఆఫర్ వచ్చాయా? అని అడిగితే తనదైన స్టైల్ లో పంచ్ ఇచ్చింది సాయి పల్లవి.ఇప్పటికీ చాలామంది దర్శకులు తన దగ్గరికి వచ్చి ఈ సీన్ కథకు చాలా ముఖ్యం మేడమ్, ఒక్క ముద్దు సీన్ ప్లీజ్” అని బతిమాలుతుంటారని కానీ ఈ అమ్మడు మాత్రం నావల్ల కాదు అని కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పుకొచ్చింది.ఒకరకంగా ఈ అమ్మడు చెప్పిన సమాధానం విని ఇప్పటి కమర్షియల్ దర్శకులునోరెళ్ళబెట్టె ఉండాలి.ఇక ఈ మాట విని ఇప్పటి హీరోయిన్లకి గిల్టీగా అనిపించినా ఆశ్చర్యం లేదు. నాకు బాయ్ ఫ్రెండో లేక భర్త ఉంటే కేవలం నటన కోసమైనా నేను ఇంకొకరిని ముద్దు పెట్టుకుంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు అంటూ స్క్రీన్ మీద కెమిస్ట్రీ పండించడం కోసం రియల్ లైఫ్ పార్ట్నర్ ని మోసం చేయలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది అన్నమాట.
అసలు హైలైట్ ఏంటో తెలుసా
ఇక వీటన్నింటిలో అసలు హైలైట్ ఏంటో తెలుసా …డబ్బు, లగ్జరీ ల మీద ఆమె వేసిన ఆమె చేసిన కామెంట్స్.బతకడానికి ఒక ఇల్లు, ఒక కారు, మంచి ఫ్యామిలీ ఉంటే చాలు .అవన్నీ నాకు ఆల్రెడీ ఉన్నాయి.ఇంకా మరో కొత్త లగ్జరీ కారు కొనడం కోసం నా విలువలు వదులుకొని స్కిన్ మీద ముద్దులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు అంటూ తేల్చి చెప్పేసింది ఈ హైబ్రిడ్ పిల్ల .మరి ఈ మాట విన్నాక కేవలం ఒకే ఒక్క కమర్షియల్ కోసం సినిమాల్లో ముద్దుల వర్షం కురిపిస్తున్న హీరోయిన్ల పరిస్థితి ఏంటో.
also read:ఢిల్లీ టు స్వీడన్.. సైకిల్‌పైనే 9,600 కిలోమీటర్లు! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లవ్ స్టోరీ!
అంతేకాదు నా నటన నచ్చితేనే నన్ను తీసుకోండి లేదు మా కథకు ముద్దు సీనే ముఖ్యం అనుకుంటే నాకన్నా బాగా ముద్దు పెట్టే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు అంటూ మొహం మీదే చెప్పేసినంత పని చేసింది సాయి పల్లవి.
సాయి పల్లవిని పెట్టుకోవాలంటే వందసార్లు ఆలోచిస్తారేమో
నిజానికి డబ్బు కోసం, సినిమాల కోసం, హిట్ల కోసం దర్శకులు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో నేను పెట్టే కండిషన్స్ నచ్చితేనే రండి అంటున్న సాయి పల్లవిని మెచ్చుకొని తీరాల్సిందే.అందుకే నెటిజన్లు కూడా.. మా సాయి పల్లవి నువ్వు గ్రేట్ అంతే అంటూ ఆకాశం లోకి ఎత్తేస్తున్నారు.ఏది ఏమైనా ఈ దెబ్బతో ముద్దు సీన్లని అడ్డం పెట్టుకొని కథలు రాసుకోవాలి అని అనుకుంటున్న చాలామంది దర్శకులు సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టుకోవాలంటే వందసార్లు ఆలోచిస్తారేమో!