E-Paper
Advertisement

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు చెళియన్ కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు చెళియన్ కన్నుమూత
Advertisement

R Chezhiyan:కోలీవుడ్ లో వరుస మరణాలు క్యూ కడుతున్నాయి.మొన్నటికి మొన్న భారతీరాజా మృతిచెందగా ,ఆ తర్వాత భాగ్యరాజా కాలం చేసిన సంగతి తెలిసిందే .ఇక తాజాగా అదే బాటలో జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ, తమిళ సినీ దర్శకుడు సినిమాటోగ్రాఫర్ అయిన ఆర్. చెళియన్ (57) కన్ను మూశారు .గత కొంతకాలంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్. చెళియన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు.ఇక ఆయన మరణ వార్త విన్న కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురయింది .ఈ సందర్భంగా ఒక మంచి టెక్నీషియన్ ని కోల్పోయామంటూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతా .ఆర్. చెళియన్ విషయానికొస్తే కేవలం  సినిమటోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా, రచయితగా కోలీవుడ్ సినిమాలపై తనదైన ముద్ర వేశాడు .

ఉత్తమ తమిళ  చిత్రంగా నేషనల్ అవార్డ్

Advertisement

ముఖ్యంగా  టు లెట్ (2017)  సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా అందించారు .ఒక ఒక మధ్య తరగతి కుటుంబం చెన్నైలాంటి పెద్ద నగరంలో ఇల్లు రెంటుకి దొరకక ఇబ్బందులు  ఎలా పడుతుందో  కళ్లకు కట్టినట్టు చూపించాడు చెళియన్.ఇక ఈ సినిమా 65వ జాతీయ చలనచిత్ర వార్డులో ఉత్తమ తమిళ  చిత్రంగా నేషనల్ అవార్డ్ ని  గెలుచుకుంది.ఇక ఈ సినిమాకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే అసలు ఎక్కడ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాడకపోవడం .కేవలం అక్కడ ఉన్న శబ్దాలతోనే సినిమా తీసి సరికొత్త ఎక్స్పరిమెంట్ చేశాడు చెళియన్.

also read:కథలో ముద్దు సీన్లు ఉంటే నన్ను తీసేయండి.. ‘సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Advertisement

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100కు పైగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ అయి ఎన్నో అవార్డులను, రివార్డులను కొల్లగొట్టింది కూడా.బాల దర్శకత్వంలో తెరకెక్కించిన పిరియాడిక్ డ్రామా పరదేశి 2013 సినిమాకి చెళియన్ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పవచ్చు.ఈ సినిమాకి గాను ఆయన లండన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును అందుకున్నాడు కూడా.దీంతో పాటు’కల్లూరి’ (2007), ‘మగిళ్చి’ (2010), ‘రెట్టై సులి’ (2010), ‘సవరకత్తి’ (2018) లకి  సినిమాటోగ్రఫీ అందించాడు చెళియన్.

చిన్న వయసులోనే కన్నుమూయడం  బాధాకరం

ఇక ఆయనకి  సినిమాలతో పాటు సాహిత్యంలోనూ మంచిపట్టుంది.ముఖ్యంగా ఆనంద వికట వారపత్రికలో ఆయన రాసిన నంద వికటన్ వారపత్రికలో ఆయన రాసిన ‘ఉలగ సినిమా’ (ప్రపంచ సినిమా) వ్యాసాలు ఎంతమంది సినీ  లవర్స్ ని ఆకట్టుకున్నాయి.ఇక ప్రపంచ స్థాయి సినిమాలను, వాటి మేకింగ్ విధానాన్ని తమిళ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేస్తూ రాసిన పుస్తకాలు ఇప్పటికీ ఎంతో మందికి టెక్స్ట్ బుక్స్ లాగా ఉపయోగపడుతున్నాయి .ఇంతటి సినిమా నాలెడ్జ్ ,సామాజిక స్పృహ ఉన్న చెళియన్ 57 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూయడం నిజంగా బాధాకరం.

Related News

‘టాక్సిక్’లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లెక్క చూస్తే మైండ్ బ్లాక్!

ఇరుముడి దెబ్బకి బాక్సాఫీస్ షేక్.. టాప్-5లోకి ఎంట్రీ!

అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన ఘనత!

దసరా బరిలో ‘రణబాలి’.. రిలీజ్ డేట్ లాక్!

మళ్లీ సంక్రాంతికి సిద్ధమవుతున్న తెలుగమ్మాయి.. సక్సెస్ అవుతుందా?

నాగ్ బర్త్ డే ట్రీట్ లోడింగ్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

Big Stories

Advertisement
×