Actresses and Their Expensive Pets: హీరోయిన్స్ అనగానే గుర్తొచ్చేది ఖరీదైన కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ ట్రిప్స్ ,డిజైనర్ డ్రెస్సులు..కాని వాళ్ళ లైఫ్ లో ఇంకో స్పెషల్ కూడా ఉంది అదేంటో తెలుసా.. పెంపుడు జంతువులు.అవును కుక్కలు ,పిల్లలు అంటే చాలామంది హీరోయిన్స్ కి ఎంత ఇష్టమో వాళ్ళ సోషల్ మీడియా చూస్తేనే అర్థమయిపోతుంది.షూటింగ్ కి వెళ్లినా , షూటింగ్ వెళ్లేటప్పుడు షూటింగ్ వచ్చాక ముందుగా పలకరించేది వీటినే ,అందుకే వాటి కోసం లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు.మరింతకి మన స్టార్ హీరోయిన్స్ లో ఎవరెవరు తమ పెంపుడు జంతువులకి ఎంతెంత ఖర్చు పెడతారో చూసేద్దామా !
సమంత
వీళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సింది సమంత గురించి.తనకి”హాష్”,”సాషా అనే రెండు పెంపుడు కుక్కలున్నాయి.వాటిని కుక్కల్లా కాదు సొంత పిల్లలుగా పెంచుకుంటుందని ఒక టాక్.ఇక షూటింగ్ లేకపోతే మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గడిపెస్తుందట సామ్.ఇక యోగ చేసినా కూడా అని పక్కనే ఉంటాయట .షూటింగ్ లేకపోతే లేదా షూటింగ్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చిన సమంతకి ఆ రెండు పెంపుడు కుక్కలే మంచి రిలీఫ్ ఇస్తాయట.వీటి కోసం మంచి క్వాలిటీ చెకప్, గ్రూమింగ్ టాయ్స్, అంటూ లక్షల్లో ఖర్చు చేస్తుందట సామ్.
రష్మిక మందన్న
ఇక సమంత తర్వాత ఈ లిస్టులో చెప్పాల్సిన మరో ముద్దుగుమ్మ రష్మిక మందన్న .తన పెంపుడు జంతువు ‘ఆరా’ అంటే తనకి ఎంతో ఇష్టం.చాలాసార్లు సోషల్ మీడియాలో ఈ ఆరాతోనే దర్శనం ఇస్తూ ఉంటుంది.అది ఇంట్లో అల్లరి చేసినా, అడ్డదిడ్డంగా తిరిగినా ఏం చేసినా వీడియో తీసి పోస్ట్ చేసేస్తుంది .ఇక ఆరా బర్త్ డే వస్తే పార్టీ ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేయడం మనం చూసాం కూడా.మొత్తంగా ఆరాకి మంచి డైట్, డాక్టర్ చెకప్,గ్రూమింగ్ ఇలా అన్ని టైంకి జరగాల్సిందేనట .అలా ఎంత బిజీగా ఉన్నాఆరా కోసం కచ్చితంగా సమయం కేటాయిస్తుందట ఈ నేషనల్ క్రష్.
కీర్తి సురేష్
ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సింది కీర్తి సురేష్.తనకి నైకి అనే పెట్ డాగ్ ఉంది.ఇంట్లో అందరూ దాన్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేయడం విశేషం.ఇక పండగ వచ్చిందంటే దానికి కూడా కొత్త డ్రెస్ వేయాల్సిందే.ఇక ఫ్యామిలీ ఫోటో అంటే మాత్రం అందులో నైకి ఉండాల్సిందే.ఇంక కీర్తి ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తే ముందుగా వెల్కం చెప్పేది ఈ నైకీ నే .అందుకే దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతుందట మన మహానటి.
ఆలియా భట్
ఇక వీళ్ల తర్వాత పిల్లులని అమితంగా ఇష్టపడే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ .ఆమె పెంపుడు పెళ్లి ఎడ్వర్డ్ గురించి ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా.దానికి ప్రత్యేకంగా ఆటో బొమ్మలు, పడుకునే బెడ్ నుంచి ఫుడ్ వరకు అన్ని ఒక ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసిందట ఆలియా భట్.ఇక పిల్లి ఆరోగ్యం కోసం రెగ్యులర్ గా డాక్టర్ దగ్గర హెల్త్ హెల్త్ చెకప్ కూడా చేయిస్తుందట ఈ బీ టౌన్ బ్యూటీ.
ప్రియాంక చోప్రా
ఇక ప్రియాంక చోప్రా దగ్గర కూడా చక్కగా మూడు పెంపుడు కుక్కలున్నాయండోయ్.డయానా, జినో, పాండా అంటూ వాటికి ఎంచక్కా పేర్లు కూడా పెట్టేసింది.ఇక వాటితో ఫోటోలు దిగడం, ట్రిప్స్ కి తీసుకెళ్లడం అంటే ఈ గ్లోబల్ బ్యూటీ కి చాలా ఇష్టం.ఇక్కడే కాదు విదేశాలకు తీసుకెళ్లినా అక్కడ వాటిని జాగ్రత్తగా చూసుకునే కేర్ టేకర్స్ ని అపాయింట్ చేస్తుందట ఈ గ్లోబల్ బ్యూటీ.ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా జంతువులను అమితంగా ఇష్టపడేదే.ఇంట్లో పెంపుడు జంతువులతో టైం కేటాయించడం అంటే తనకు చాలా రిలాక్స్ గా ఉంటుందని చాలా సార్ చెప్పింది కూడా .
శ్రద్ధ కపూర్
ఇక షూటింగ్ టెన్షన్ అంతా వాడితో ఆడుకుంటే పోతుందని అంటుంది బ్యూటీ ఇక శ్రద్ధ కపూర్.అయితే ఒక అడుగు ముందుకే వేసి పెంపుడు కుక్కలని చూసుకోవడంమే కాదు,వీధి కుక్కలకు కూడా ఆహారం పెట్టడం విశేషం .ఎన్నోసార్లు జంతువులను కొనకండి దత్తత తీసుకోండి అని అభిమానులకు సూచించింది కూడా .ఇక ఎన్నో జంతువుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటూ తెగ సందడి చేసింది శ్రద్ధ.
కుక్కలు కూడా ఇప్పుడు సెలబ్రిటీలే
మొత్తంగా వీళ్ళని చూస్తుంటే పెంపుడు జంతువులని పెంచడం అంటే అంత ఆశామాషి కాదని అర్థమయిపోతుంది.మంచి ఫుడ్డు, వ్యాక్సిన్, డాక్టర్ ఫీజులు, గ్రూమింగ్, ట్రైనింగ్ టాయ్స్,ట్రావెల్ ఇలా మనిషికి మించిన ఖర్చు కుక్కలకి పెట్టేస్తున్నారు మన స్టార్ హీరోయిన్స్ .అయితే ఇది ఇక్కడిదో ఆగిపోలేదండోయ్.
also read :తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. గౌరీ ప్రియా కామెంట్స్ వైరల్ !
చాలామంది హీరోయిన్లు తమకు కాకుండా తమా పెంపుడు జంతువులకు కూడా స్పెషల్ గా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తుండటం విశేషం.పైగా వాటి ఫోటోలు, వీడియోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి కూడా.మరికొన్నిసార్లు ఒక అడుగు ముందుకేసి కొన్ని బ్రాండ్లని కూడా వీటితోనే ప్రమోషన్ చేస్తున్నారు.అంటే ఈ హీరోయిన్స్ తో పాటు వాళ్ళ పెంపుడు కుక్కలు కూడా ఇప్పుడు సెలబ్రిటీలే అన్నమాట.!