Trolls On Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) గురించి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లకు అతన్ని సెలెక్ట్ చేశారు. ఐర్లాండ్ సిరీస్ లో మిస్ అయినప్పటికీ… ఇంగ్లాండ్ సిరీస్ లో మాత్రం అతడిని ఆడిస్తారని అంటున్నారు. నేటి నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ టి20 సిరీస్ (Team India vs England T20 Series) ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 10 గంటల సమయంలో తొలి టీ20 షురూ అవుతుంది. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్య వంశీ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. వైభవ్ ఆడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతన్ని ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇంకెప్పుడు నీ ఎంట్రీ అంటూ పరువు తీశారు. ఈ సంఘటన వైరల్ గా మారింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England T20 Series) మధ్య ఇవాళ టి20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న చెస్టర్ లే స్ట్రీట్ రివర్సైడ్ గ్రౌండ్ లో (Riverside Ground, Chester-le-Street) వామప్ చేశాడు. ఈ సందర్భంగా స్టేడియానికి వచ్చిన ఇంగ్లాండ్ అభిమానులు, లోకల్ గా ఉన్న అమ్మాయిలు… వైభవ్ ను ర్యాగింగ్ చేశారు. వైభవ్.. వైభవ్ అంటూ గట్టిగా అరిచారు. నీ ఎంట్రీ ఎప్పుడు ? అంటూ వైభవ్ ను హేళన చేస్తూ మాట్లాడారు. పదేపదే ఇంగ్లాండు అభిమానులు ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో… ముఖం చాటేసాడు వైభవ్ సూర్యవంశీ. తన టీ షర్ట్ క్యాప్ ను (వార్మప్ డ్రెస్) ముఖానికి అడ్డం పెట్టుకొని వెళ్ళాడు.
తన ముఖం ఎవరికి కనిపించకుండా… తన వార్మప్ డ్రెస్ తో కవర్ చేశాడు. అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని ఒంటరి చేసి హేళన చేస్తారా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పటికే ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే టీమిండియా ఆడుతుందని విమర్శలు వస్తున్నాయి. అలాంటి టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై ఎలా రాణిస్తుందో చూడాల్సిన పరిస్థితి నెలకొంది.