E-Paper
Advertisement

రైలులో మందుకొట్టిన ప్రయాణికులు.. ఫిర్యాదు చేసినా చర్యలేవీ?

రైలులో మందుకొట్టిన ప్రయాణికులు.. ఫిర్యాదు చేసినా చర్యలేవీ?
Advertisement

Indian Railways Alcohol Rules: చాలా మంది రైలు ప్రయాణం అంటే కుటుంబంతో కలిసి ప్రశాంతంగా వెళ్తుంటారు. అయితే, కొంతమంది ప్రయాణికులు రైలులోనే మద్యం సేవించడం, పెద్దగా మాట్లాడటం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముందు సీటులో ఉన్న ప్రయాణికుడి ఫిర్యాదు

వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది ప్రయాణికులు రైలులో మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే కోచ్‌లో ముందు సీటులో ఉన్న ఓ ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కుటుంబంతో ప్రయాణిస్తున్నానని, వారి వల్ల అసౌకర్యంగా ఉందన్నారు. తమ సీట్లు మార్చాలని ఆయన రైల్వే పోలీసులను కోరాడు. అయితే, ఫిర్యాదును రాతపూర్వకంగా ఇవ్వాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ.. రైలులో ప్రయాణికుల భద్రత, ప్రశాంతమైన ప్రయాణానికి రైల్వే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

రైలులో మద్యం సేవించడం నేరం

Advertisement

రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 145 ప్రకారం రైలులో, రైల్వే ప్రాంగణంలో మద్యం మత్తులో ఉండటం, న్యూసెన్స్ చేయడం, ఇతర ప్రయాణికుల ప్రశాంతమైన ప్రయాణానికి ఇబ్బంది కలిగించడం నేరంగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తిని రైల్వే సిబ్బంది రైలు నుంచి బయటకు పంపించే అవకాశం ఉంటుంది. టికెట్, పాస్‌ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది. నేరం రుజువైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.500 వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది.

వెంటనే ఎలా ఫిర్యాదు చేయాలి?

రైలులో ఇలాంటి సమస్య ఎదురైతే ప్రయాణికులు సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వవచ్చు. ఇండియన్ రైల్వేస్ అధికారిక రైల్ మద్దత్ సాయంతో ఫిర్యాదు చేసే అవకాశం ది. ప్రయాణ వివరాలు, PNR, కోచ్, బెర్త్ నంబర్, సమస్యకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో, వీడియో లాంటి ఆధారాలను కూడా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో 139 రైల్వే హెల్ప్‌ లైన్ ద్వారా కూడా  ఫిర్యాదు చెయ్యొచ్చు.

TTE, RPF సిబ్బందికి కంప్లైంట్ చేయండి!  

Advertisement

రైలులో ఉన్నప్పుడు సమస్య ఎదురైతే సమీపంలోని TTE, RPF సిబ్బంది, ఇతర రైల్వే సిబ్బందికి విషయాన్ని తెలియజేయడం మంచిది. పరిస్థితిని బట్టి వారు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇబ్బంది కలిగించే ప్రయాణికుల కారణంగా కుటుంబంతో ప్రయాణించడం అసౌకర్యంగా మారితే TTEని సంప్రదించి మరో బెర్త్ అందుబాటులో ఉందేమో అడగవచ్చు. ఖాళీ బెర్త్ ఉంటే పరిస్థితిని బట్టి మార్పు చేసే అవకాశం ఉంటుంది.  మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గొడవ చేయడం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం లాంటి పరిస్థితుల్లో వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడం ముఖ్యం.

Read Also: క్యాబ్‌పై కూర్చుని వర్క్.. ఈ ఐటీ ఉద్యోగి కేక!

Tags

Related News

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

Big Stories

Advertisement
×