BigTV English

Kuberaa OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Kuberaa OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కుబేర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Kuberaa Now Streaming on This OTT: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, హీరోయిన్ రష్మిక కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లో విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. డిఫరెంట్ కాన్పెంట్ తో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా బిచ్చగాడిగా ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.


ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్

బాక్సాఫిసు వద్ద భారీ వసూళ్లు చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికగా సందడి చేసేందుకు వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే కుబేర ఓటీటీలో దర్శనం ఇచ్చింది. దీంతో మూవీ లవర్స్ అంతా ఫుల్ సర్ప్రైజ్ అవుతున్నారు. బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీ రావడం షాకిస్తోంది. కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఈ సినిమాను తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా జూలై 20న వస్తుందనుకున్న ఈ చిత్రం రెండు రోజుల ముందే ఓటీటీకి రావడం విశేషం.


క‌థ విష‌యానికి వ‌స్తే..

దేశంలోనే సంపన్నుడైన గ్లోబల్ ఎంటర్ప్రైజేస్ సీఈవో నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవాలి ఆశపడుతాడు. ఇక తన కలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వ రంగ ప్రాజెక్ట్ ని వినియోగించుకోవాలనుకుంటాడు. అదే టైంలో ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తుంది. దానికి నీరజ్ మిత్ర వినియోగించుకోవాలనుకంుటుాడు. అయితే రూ. లక్ష కోట్ల డీల్ కుదుర్చుకుంటాడు. బ్లాక్ లో ఉన్న డబ్బును తనకు వైట్ లో ఇవ్వాలని నీరజ్ కు సిద్ధప్ప షరతు విధిస్తాడు. దీంతో ఆ మొత్తాన్ని వైట్ గా మార్చడానికి సిబిఐ ఆఫీసర్ దీపక్ తేజ్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. జైల్లో ఉన్న అతడికి విడిపించాలంటే తనకు ఈ సాయం చేయాలని నిబంధన పెట్టిన బయటకు తీసుకువస్తాడు. దీనికోసం దీపక్ నలుగురు బిచ్చగాళ్లను ఎంచుకుంటాడు. ఈ పని పూర్తి కాగానే ఆ నలుగురు బిచ్చగాళ్లను చంపేయాలని నీరజ్ ప్లాన్ చేయగా.. వారిలో ఒక్కడిగా ఉన్న దేవా (ధనుష్) తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవా వారికి దొరికాడా? తన పేరుపై ఉన్న పదివేల కోట్ల డబ్బు ఏం చేశాడు? అనేది మిగతా కథ.

Also Read: ఈ హర్రర్ మూవీ తీసిన యూనిట్‌కు భయానక అనుభవాలు.. జీవితాలు ఛిద్రం, అసలు ఏమైంది?

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×