E-Paper
Advertisement

పెద్ది స్పెషల్ సాంగ్.. రంగంలోకి బాలయ్య బ్యూటీ.. ఈసారైనా ఫైనల్ అయ్యేనా?

పెద్ది స్పెషల్ సాంగ్.. రంగంలోకి బాలయ్య బ్యూటీ.. ఈసారైనా ఫైనల్ అయ్యేనా?
Advertisement

Peddi Movie: బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ (Ramcharan)హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది (Peddi)ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా వాయిదాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేస్తూ తిరిగి జూన్ నెలలో విడుదల కాబోతుందని తెలియజేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని కేవలం ఒక పాట మాత్రమే పెండింగ్ ఉందని అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.

పెద్ది నుంచి మృణాళ్ ఔట్ ..

ఇక ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అయినప్పటికీ ఒక సాంగ్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. అయితే అది స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్ కానీ తరుణంలోనే షూటింగ్ ఆలస్యమవతుందని సమాచారం. రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ చేయడం కోసం దర్శక నిర్మాతలు ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించారని తెలుస్తుంది. అయితే ఎక్కువగా మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆమె ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో భాగం కావడం లేదని సమాచారం. ఇక నిన్నటికి నిన్న మానస వారణాసి పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే నేడు మరొక హీరోయిన్ పేరు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మారుమోగుతుంది.

పెద్దితో స్టెప్పులేయబోతున్న సంయుక్త?

Advertisement

పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్ అయ్యారని తెలుస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊహించని విధంగా సంయుక్త (Samyuktha Menon) పేరు తెరపై రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంయుక్త మీనన్ సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె పలు పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ సాంగ్ కోసం చిత్ర నిర్మాతలు ఈమెను పరిశీలిస్తున్నట్టు సమాచారం . సంయుక్త మీనన్ దాదాపు ఈ సినిమాలో ఖరారు అయ్యారని త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

జాజికాయ పాటలో డాన్స్ అదరగొట్టిన సంయుక్త..

Advertisement

ఇటీవల ఈమె బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాజికాయ అనే పాట ద్వారా ఓ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చిన సంయుక్త ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన స్పెషల్ స్టెప్పులు వేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇలా సంయుక్త మీనన్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలులో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సిందిగా ఈ వార్తలపై అభిమానులు స్పందిస్తూ ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి ఈసారైనా సంయుక్త పేరు ఫైనల్ అవుతుందా లేదా అంటూ సందేహాలను వ్యక్త పరుస్తున్నారు.

Also Read: ఇక పై ఏకపక్ష నిర్ణయాలు ఉండవ్.. నిర్మాతల నిర్ణయమే ఫైనల్..

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×