King dom Story: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)త్వరలోనే కింగ్ డం(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఇక నేడు కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరగనుంది. ఇకపోతే ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి కింగ్ డం సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…
పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ..
ఈ సినిమా అన్న తమ్ముడు సెంటిమెంట్ సినిమాగా రాబోతుందని తెలుస్తుంది. అయితే చిన్నప్పుడే విజయ్ దేవరకొండ తన అన్నయ్య సత్యదేవ్(Satya Dev) నుంచి అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోతారు. పెరిగి పెద్దయిన తర్వాత విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా సత్యదేవ్ మాత్రం ఒక మాఫియా గ్యాంగ్ లో చేరి మాఫియా లీడర్ గా మారుతారు. పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్ దేవరకొండకు ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇవ్వడంతో ఆయన తన కుటుంబం, తన జాబ్ వదిలి రహస్యంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే శ్రీలంక వెళ్లి మాఫియా డాన్ అయిన సత్యదేవ్ ను చంపాల్సి ఉంటుంది. శ్రీలంక వెళ్ళిన తర్వాత విజయ్ దేవరకొండకు ఆ మాఫియా డాన్ తన అన్నయ్య అనే విషయం తెలుస్తుంది.
అన్నను చంపేసిన తమ్ముడు..
ఇక సత్యదేవ్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నప్పటికీ ఈయన రాబిన్ హుడ్ లా దొంగతనం చేసి అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి తరుణంలోనే సత్యదేవ్, వెంకటేష్ (మురుగన్) మధ్య గొడవ జరుగుతుంది ఈ విషయం తెలియని విజయ్ దేవరకొండ ఓ సందర్భంలో తన అన్నయ్యను స్వయంగా చంపేస్తాడు. తరువాత తన అన్న చేసిన పనులు తెలుసుకున్న విజయ్ దేవరకొండ పోలీస్ ఉద్యోగం వదిలేసి తన అన్నయ్య స్థానంలో మాఫియా లీడర్ గా మారడంతో మురుగన్ విజయ్ దేవరకొండ మధ్య యుద్ధం కొనసాగుతుంది.
ఈ స్టోరీతో విజయ్ హిట్ కొట్టేనా?
ఇలా ఈ కథతో మొదటి భాగం మొత్తం రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్వయంగా తమ్ముడు అన్నయ్యను చంపే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా? అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేస్తుంది. మరి 31వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులను ఈ సెంటిమెంట్ తో సందడి చేస్తుందా? విజయ్ దేవరకొండకు హిట్ ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shri Borse) నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Senior Actress: ఈ సీనియర్ హీరోయిన్‌కు మూడు పెళ్లిళ్లు … ఒక్కో దానికి ఒక్కో రీజన్