Ongole Child Lakshit: ప్రకాశం జిల్లాలో మూడేళ్ల బాలుడు లక్షిత్ హత్య కేసు.. ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అమాయకుడైన ఓ పసివాడిని దారుణంగా హత్య చేయడం.. అందరినీ షాక్‌కి గురిచేసింది. అసలు.. ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారు? హత్యకు గల కారణాలు ఏమిటనే దానిపై.. మిస్టరీ కొనసాగుతోంది. బాలుడిని చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది? అనేది.. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. పోలీసులు కేసును ఛేదించేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ సరైన ఆధారాలు గానీ, హంతకుల ఆచూకీ గానీ దొరకలేదు.
మొన్న అంగన్‌వాడీ కేంద్రం నుంచి అదృశ్యమైన లక్షిత్.. ఇవాళ ఉదయం వాళ్ల ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో శవమై కనిపించాడు. అంత దూరం లక్షిత్‌ని తీసుకెళ్లిందెవరు? అంగన్‌వాడీ ఉండాల్సిన పిల్లాడిని ఎవరు తీసుకెళ్లారు? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇది తెలిసినవాళ్ల పనేనా? వ్యక్తిగత కక్షలా? ఆస్తి వివాదాలా? కుటుంబ కక్షలతోనే లక్షిత్‌ను హతమార్చారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే అనుమానాలు ఉన్నాయి. కొన్ని వర్గాలు క్షుద్రపూజల కోణంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇక.. మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిన్నారి లిక్షిత్‌కు పోస్టుమార్టం పూర్తి చేశారు డాక్టర్లు. తర్వాత.. అంబులెన్స్‌లో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. బాలుడి మృతదేహం లభ్యమైన పరిసర ప్రాంతాలను క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. లక్షిత్ ఒంటిపై గాయాలేమీ లేవని తేల్చారు. దాంతో.. ఎవరు హత్య చేశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకడం లేదు. తప్పిపోయిన రోజే బాలుడు మృతి చెందాడా? అంగన్‌వాడీ కేంద్రం నుంచి 3 కి.మీల దూరం ఎలా వెళ్లాడు? చిన్నారి వెళ్తుండగా ఏ ఒక్కరూ కూడా చూడలేదా? అనేది తేలడం లేదు.
Also Read: టూరిస్టు కొంప ముంచిన కారు స్టంట్ .. రెప్పపాటులో 300 అడుగుల లోయలోకి.. వైరల్ వీడియో..
లక్షిత్ సాధారణంగా మృతి చెందాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారని ఆవేశంతో.. గ్రామస్తులు మహిళలు కంభం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు కంభం సీఐ మల్లికార్జున్ వారికి సర్ధి చెప్పడంతో వారంతా ధర్నాను విరమించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి