BigTV English

Jurassic World Rebirth Review : ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ రివ్యూ… ఈసారి డైనోసార్ల అరాచకం ఎలా ఉందంటే

Jurassic World Rebirth Review : ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ రివ్యూ… ఈసారి డైనోసార్ల అరాచకం ఎలా ఉందంటే

రివ్యూ : జానర్ : ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ మూవీ


నటీనటులు : స్కార్లెట్ జాన్సన్, మార్షలా అలీ, జోనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్, మాన్యువెల్ గార్సియా-రుల్ఫో, లూనా బ్లేజ్ తదితరులు
దర్శకుడు : గారెత్ ఎడ్వర్డ్స్

Jurassic World Rebirth Review in Telugu : హాలీవుడ్ సినిమాలంటే ఇండియన్ మూవీ లవర్స్ లో చెప్పలేనంత క్రేజ్ ఉంది. అందులోనూ ‘జురాసిక్ వరల్డ్’ ఫ్రాంచైజీ అంటే చెవి కోసుకునే వారి సంఖ్య భారీగానే ఉంది. యాక్షన్, అడ్వెంచర్, సై-ఫై, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులకు మరిచిపోలేని కిక్కిచ్చే మరో కొత్త పార్ట్ ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది? ఈసారి డైనోసార్ల అరాచకం ఆకట్టుకుందా ? అనేది మూవీ రివ్యూలో తెలుసుకుందాం.


కథ
Jurassic World Rebirth జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్‌లో ఏడవ చిత్రం. Jurassic World Dominion (2022) సంఘటనల అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత జరిగే కథ. భూమి వాతావరణం డైనోసార్లకు అనుకూలం కాకపోవడంతో, అవి ఈక్వటోరియల్ దీవులలోని ట్రాపికల్ బయోస్ఫియర్‌లో మాత్రమే జీవిస్తాయి. ఈ దీవుల్లో మోసాసారస్, టైటానోసారస్, క్వెట్జల్‌కోట్లస్ అనే మూడు అతిపెద్ద జాతులు ఉంటాయి. వీటి DNAలో గుండె వ్యాధులకు సంబంధించిన విప్లవాత్మక ఔషధానికి తగిన సీక్రెట్ దాగి ఉంటుంది. బిగ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ మార్టిన్ క్రెబ్స్ (రూపర్ట్ ఫ్రెండ్) ఈ డీఎన్ఏని సేకరించడానికి ఒక రహస్య మిషన్‌ను ప్లాన్ చేస్తాడు.

జోరా బెన్నెట్ (స్కార్లెట్ జోహాన్సన్) అనే కోవర్ట్ ఆపరేటివ్, హెన్రీ లూమిస్ (జోనాథన్ బెయిలీ) అనే పాలియోంటాలజిస్ట్ ఈ ఆపరేషన్ లో భాగంగా డైనోసార్ల డీఎన్ఏను టెస్ట్ చేయడానికెళ్తారు. వీళ్ళ టీమ్ ఈ మిషన్ లో భాగంగా ఒక సముద్రంలో డైనోసార్ దాడిలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కలుస్తుంది. రూబెన్ (మాన్యువెల్ గార్సియా-రుల్ఫో), అతని ఇద్దరు కుమార్తెలు టెరెసా (లూనా బ్లేజ్), ఇసాబెల్లా (ఆడ్రినా మిరాండా), టెరెసా బాయ్‌ఫ్రెండ్ జేవియర్ (డేవిడ్ ఇయాకోనో) ఇలే సెయింట్-హ్యూబర్ట్ అనే బ్యాన్ చేసిన దీవిలో చిక్కుకుంటారు. ఇక్కడే జురాసిక్ పార్క్ రహస్య పరిశోధన కేంద్రం ఉంది. ఈ దీవిలో డిస్టార్టస్ రెక్స్ వంటి మ్యూటాంట్ హైబ్రిడ్ డైనోసార్లు ఉన్నాయి. మరి అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయట పడింది ? ఇంతకీ ఆ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యిందా? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశాలు.

విశ్లేషణ
ఈ ఫ్రాంచైజీలో స్పీల్‌బర్గ్ Jurassic Park (1993) మూవీనే ఇప్పటిదాకా మంచి కిక్ ఇచ్చిన మూవీ. ఆ తరువాత 6 పార్ట్స్ రిలీజ్ అయినప్పటికీ ఆ థ్రిల్స్‌ను ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ కూడా చేరిపోయింది. డేవిడ్ కోయెప్ స్క్రిప్ట్ ఊహించదగిన ట్విస్ట్‌లు, లాజిక్ లోపాలతో నిరాశ పరుస్తుంది. కథ ఒరిజినల్ ‘జురాసిక్ పార్క్’ నుండి ఇన్స్పైర్ అయినట్టు అన్పిస్తుంది. ఫ్రెష్ స్టోరీ లేకపోవడం అన్నది సినిమాకు అతిపెద్ద మైనస్. ‘వార్ ఆఫ్ ది వరల్డ్’ ఫస్ట్ మిషన్ ఇంపాజిబుల్ మూవీ రచయిత, ‘గ్లాడియేటర్’ కు పని చేసిన సినిమాటోగ్రాఫర్ జాన్ మాథీసన్, 2014 ‘గాడ్జిల్లా’ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి వర్క్ చేశారు. గారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్షన్, జాన్ మాథీసన్ సినిమాటోగ్రఫీ, జో వాకర్ ఎడిటింగ్ సినిమాకు ఒక గ్రాండ్ స్కేల్‌ను అందిస్తాయి.

ఇది వరకు వచ్చిన పార్ట్స్ లో అందరూ డైనోసార్ల నుంచి డబ్బు సంపాదించుకుందాం అనుకుంటే, ఈ పార్ట్ లో మాత్రం వాటి నుంచి మనుషుల కోసం మందు కనిపెడదాం అనుకుంటారు. అయితే ఎప్పటిలాగే ఓ మిషన్, దానికోసం బయల్దేరే హీరో లేదా హీరోయిన్ టీం, అందులో ఓ ఫ్యామిలీ డైనోసార్ల బారిన పడి తప్పించుకోవడం అన్నది మాత్రం అన్నీ జురాసిక్ పార్ట్స్ లో సేమ్ టు సేమ్. ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ కూడా అంతే. స్కార్లెట్ జాన్సన్ లాంటి టాప్ యాక్టర్ భాగమైనప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ.

ఇక డెల్గాడో కుటుంబం సబ్‌ప్లాట్ అనవసరంగా అనిపిస్తుంది. ఇది గనుక లేకపోతే సినిమా అసలు కథ ఫోకస్డ్ గా ఉండి, ప్రేక్షకులను ఇంకాస్త ఆకట్టుకునేది. ‘జురాసిక్ పార్క్’ ఒరిజినల్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ను తిరిగి తీసుకురావడంలో ఈ సినిమా కూడా ఫెయిల్ అయ్యింది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ ఎమోషనల్ డెప్త్ పరంగా ఆ ఇంటెన్సిటీనీ క్రియేట్ చేయలేకపోయారు. ఎంతసేపూ ఒరిజినల్ మూవీ నోస్టాల్జియాను క్రియేట్ చేయడంపైనే ఫోకస్ పెట్టి, రోల్స్ ను డెవలప్మెంట్ ను పెద్దగా పట్టించుకోలేదు.

డిస్టార్టస్ రెక్స్ వంటి మ్యూటాంట్ డైనోసార్లు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, వాటి స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండడం మరో మైనస్. స్నికర్స్, ఆల్టాయిడ్స్, ట్విజ్లర్స్, డారిటోస్ వంటి బ్రాండ్‌ల ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ ఇది సినిమానా లేక యాడ్ అడ్వర్టైజ్‌మెంటా అన్పించేలా చేస్తాయి. CGI లో డైనోసార్లు, ముఖ్యంగా డిస్టార్టస్ రెక్స్ అద్భుతంగా రూపొందించారు. సౌండ్ డిజైన్ థియేటర్‌లో ఒక మంచి ఫీలింగ్ ను అందిస్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే Godzilla, Jaws వంటి హాలీవుడ్ సినిమాల సీన్స్ గుర్తొస్తాయి. కొత్తగా క్రియేట్ చేసిన డైనోసార్ ను ‘ఏలియన్’ మూవీలో చూసినట్టు అన్పిస్తుంది.

ఇక స్కార్లెట్ జాన్సన్, మార్షలా అలీ స్క్రీన్ పై తమ సహజమైన కరిష్మాతో ఆకట్టుకున్నారు. జోనాథన్ బెయిలీ నర్వస్ పాలియోంటాలజిస్ట్ హెన్రీ పాత్ర ఆకర్షణీయంగా ఉంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్
నటీనటులు
విజువల్ ఎఫెక్ట్స్
సౌండ్ డిజైన్

మైనస్ పాయింట్స్
ప్రిడిక్టబుల్, లాజిక్-లెస్ స్క్రిప్ట్
ఫ్యామిలీ సబ్‌ప్లాట్
ఓవర్-ది-టాప్ ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్

మొత్తంగా
‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ వన్ టైమ్ వాచ్. ‘జురాసిక్ వరల్డ్’లో ఫస్ట్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్స్ తో పోలిస్తే ఇది బెటరే.

Jurassic World Rebirth Rating : 1.5/5

Related News

Paradha Review: ‘పరదా’ రివ్యూ : గుడ్డినమ్మకం పనికిరా(లే)దు 

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Big Stories

×