OTT Movie : ఓటీటిలోకి ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఒక డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. ఒక హాస్పిటల్‌లోని వార్డ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తో ఈ స్టోరీ ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘భవానీ వార్డ్ 1997’ (Bhavani Ward 1997). 2025లో విడుదలైన ఈ సినిమాకి జి.డి. నరసింహ దర్శకత్వం వహించారు. ఇందులో గణేష్ రెడ్డి బుడుపు, గాయత్రి గుప్తా, పూజ కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రకాంత సోలంకి, జి.డి. నరసింహ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై, మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1997లో ఒక హాస్పిటల్‌లోని భవానీ వార్డ్‌లో జరిగే భయంకరమైన సంఘటనతో ప్రారంభమవుతుంది. ఈ వార్డ్ ఒక ప్రమాదకరమైన స్థలంగా మారుతుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడికి వెళ్లకూడదని హెచ్చరికలు కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఒక ఆత్మ ఉందని నమ్ముతుంటారు. ఇక ఈ స్టోరీ అజయ్, దియా అనే జంట చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ ప్రేమ కథ మొదట ఆనందంగా సాగుతుంది. అయితే దియాని అనుకోకుండా ఒక దుష్ట ఆత్మ ఆవహిస్తుంది. దీంతో ఈ జంట జీవితం ఒక భయంకరమైన పీడకలగా మారుతుంది. దియాను ఈ దుష్ట ఆత్మ నుండి విముక్తి చేయడానికి అజయ్ ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అతను భవానీ వార్డ్ గత చరిత్రను, ఈ ఆత్మ గతాన్నికనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలో అతను సిస్టర్ ఐరీన్ అనే మహిళను కలుస్తాడు. ఆమె ఈ ఆత్మ “అర్బన్ లెజెండ్స్” అనే పుస్తకంతో సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది. అజయ్, దియా భయంకరమైన పరానార్మల్ సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక భవానీ వార్డ్‌లో జరిగిన గతం బయటకి వస్తుంది. ఇది ఈ దుష్ట ఆత్మ ఎందుకు రివేంజ్ ఆత్మగా మారిందనే దానికి కారణాలను వివరిస్తుంది. ఈ ఆత్మ ఒక ప్రతీకార ఉద్దేశంతో ఉందని. దాని రివేంజ్ కోసం దియాలో చేరిందని తెలుస్తుంది. అజయ్, సిస్టర్ ఐరీన్ సహాయంతో, స్థానిక ఆచారాలు, ఆధ్యాత్మిక పద్ధతులను ఉపయోగించి ఈ ఆత్మను ఎదిరించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి దియాను ఈ ఆత్మ ఎందుకు ఆవహించింది? భవానీ వార్డ్‌లో ఏం జరిగింది ? ఈ ఆత్మ గతం ఏమిటి ? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 30 కోట్ల బడ్జెట్, 300 కోట్ల కలెక్షన్స్… ఆస్కార్ ను అందుకున్న ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?