The Traitors:టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో సరికొత్త రియాలిటీ షో సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘బిగ్ బాస్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండగా, ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ది ట్రైటర్స్’ షో తెలుగులోకి రాబోతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. మరి ఈ విభిన్నమైన గేమ్ షో విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సినిమాలతో అలరిస్తున్న యంగ్ హీరో తేజా సజ్జా ఇప్పుడు తొలిసారిగా యాంకర్‌గా మారబోతున్నారు. బాలీవుడ్‌లో కరణ్ జోహార్ చేసిన పాత్రలో, తెలుగు వెర్షన్‌కు తేజా సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకున్న మాస్ ఇమేజ్, మంచి స్పొంటెనిటీ ఈ షోకు మరింత ప్లస్ కానున్నాయని అమెజాన్ ప్రైమ్ వీడియో వర్గాలు చెబుతున్నాయి.
ఈ షో కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక పెద్ద లగ్జరీ భవంతిలో విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలను ఒకచోట చేర్చుతారు. నమ్మకం, ఆశయం, బంధాలు మరియు వెన్నుపోటు వంటి భావోద్వేగాల మేళవింపుతో ఈ గేమ్ సాగుతుంది. ఇక ఎవరు నమ్మదగినవారు, ఎవరు మోసగాళ్లు (ట్రైటర్స్) అనేది కనిపెట్టడమే ఈ ఆటలోని అసలు మజా.
also read:బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?
ఇక ‘ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ షోకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. అక్టోబర్ 15 నుంచి ఈ క్రేజీ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానున్నాయి. తెలుగు ప్రేక్షకుల రుచికి తగినట్లుగా ఈ షోను ఎంతో గ్రాండ్‌గా డిజైన్ చేశారు.
తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ షో దూసుకుపోతున్న తరుణంలో, ఈ ‘ది ట్రైటర్స్’ షో అంతగా హైప్ తెచ్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. విభిన్నమైన కాన్సెప్ట్, సరికొత్త టాస్క్‌లతో రాబోతున్న ఈ షో ప్రేక్షకులను ఎంతవరకు కట్టిపడేస్తుందో చూడాలి. మరి బిగ్ బాస్‌ను పక్కన పెట్టి ప్రేక్షకులు ఈ కొత్త ఆటను ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే..