Satya Raj : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో సత్యరాజ్ ఒకరు. కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. సత్యరాజ్ అంటే మొదటి గుర్తొచ్చేది కట్టప్ప అనే పాత్ర.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఒక సినిమా కోసం ఐదేళ్లు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. అయితే రాజమౌళి విజన్ గ్రహించి ప్రభాస్ ఆ సినిమా కోసం ఐదు సంవత్సరాలు కేటాయించాడు. అందుకు తగ్గ ఫలితం కూడా వచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలైంది.
బాహుబలి ఒప్పుకోలేదు
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్ ఎస్ రాజమౌళి సత్యరాజ్ కు కథను చెప్పడానికంటే ముందు. ప్రభాస్ మీ తలపైన కాళ్లు పెట్టే షాట్ ఒకటి ఉంటుంది అని చెప్పారట. ఆ మాట విన్న వెంటనే బాహుబలి సినిమా నేను చేయను అని రాజమౌళి మొహం మీద చెప్పేశారట సత్యరాజ్.
ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి కథ మొత్తాన్ని సత్యరాజ్ చెప్పారట. రాజమౌళి నేరేషన్, కథలో కట్టప్ప పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఈ రెండు చూసి ఆ కథను ఓకే చెప్పాడట సత్యరాజ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్ర కూడా అదే స్థాయిలో హిట్ అయింది. ఇప్పటికి సత్యరాజ్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా కట్టప్ప గుర్తొస్తుంది.
అన్ని పాన్ ఇండియా సినిమాలే
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ కూడా అమాంతం మారిపోయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. అందుకే ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు 1000 కోట్లు సినిమాలు రెండు ఉన్నాయి. సలార్ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు ప్రభాస్. ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదలవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Lokesh Kanagaraj: కమల్ హాసన్ ఫ్యాన్ అయితే రజినీకాంత్ ని ఈ రేంజ్ లో మోసం చేయాలా?