Raj Gopal reddy: తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ రాజకీయ రగడ నడుస్తుంది. మొన్నటి వరకు మంత్రి పదవిపై ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పైసలు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రశ్నావిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై అసహనం..
మంత్రి పదవిపై కోమట రెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిరోజులుగా అసహనంగా వున్న మాట వాస్తవమే. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కష్టపడినా తనకు మంత్రి పదవి ఇవ్వలేని బహిరంగంగా మీడియా సమావేశంలో తెలిపారు. దీనిపై బ్రదర్ కోమటిరెడ్డి కూడా తనకు తెలియదని, కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని బదులిచ్చారు. మంత్రి పదవి ఇవ్వడం అనేది నా పరిధిలో అంశం కాదంటూ సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంపై సీఎం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం.
మంత్రి పదవి ఇవ్వక పోవడంపై కారణాలు..
ఒకే ఇంట్లో రెండు పదవులు ఎలా అంటూ సీఎం, పలు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు ఉంటే మంత్రి పదవి ఎలా ఇస్తారు అంటూ మండిపడుతున్నారు. ఒకరు మంత్రి, మరొకరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, పదవులు ఉంటేనే ప్రజలకు సేవ చేయాలా? ఎమ్మెల్యేగా అభివృద్ది చేయలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో పదవులు ఆశించడం ఏమిటి, ఉన్న పదవులతో అభివృద్ది చేస్తే చాలు కదా అంటూ రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Also Read :Nagarjuna: హోటల్ క్లీన్ చేసిన నాగార్జున… అసలు విషయం చెప్పిన జగపతిబాబు!
ఇద్దరు అన్నదమ్ములున్న ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉండకూడదా?
ఈ ప్రశ్నలు విన్న రాజగోపాల్ రెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఇద్దరు రాజకీయ నాయకులు ఒకే ఇంట్లో ఉన్నారని ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్నప్పుడు తెలీయలేదా? అంటూ ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు ఒకే ఇంట్లో ఉంటే తప్పేంటని అన్నారు. మంత్రి పదవికి, సోదరులకు లింక్ ఏంటో అర్థం కావడం లేదు. అయినా కాంగ్రెస్ అధికారంలో వస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ మాట ఇచ్చారని అన్నారు. అభివృద్ధి చేయడానికి అందరూ మంత్రులు కృషి చేస్తున్నట్లే మేము చేస్తామంటూ బదులిచ్చారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలకు ఎవరూ పట్టించుకోకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
వివాదం ఇలా మొదలైంది
పదవిపై పోరాడిన అధిష్టానం స్పందించక పోవడంతో.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చిన ఆయన పదవులు మీకే, పైసలు మీకేనా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు మీరు ఎలా ఇవ్వడం లేదు, కనీసం అభివృద్ధి పనులకైనా డబ్బులైనా మాకు ఇవ్వండి అంటూ ప్రశ్నించారు. మా నియోజకవర్గం ప్రజలు రోడ్డు వేయించమంటున్నారు దీనికి నిధులు ఇవ్వమంటే ఇవ్వడం లేదని విమర్శించారు. ఇంతకన్నా ఏ నాయకుడు అడుగుతాడు.
తనకు పదవి ఇవ్వలేదు సరే కనీసం నిధులైనా ఇవ్వారా అని అడిగారు. బోరుబొండ-చౌటుప్పల్ రోడ్దు వేయిస్తుండు మరి మా మునుగోడుకు దారి వేయరా? అక్కడున్న కాంట్రాక్టర్ కు పనిచేయమంటే బిల్లు ఇప్పించండి అని నాకే సమాధానం ఇస్తున్నారు. నేను రేవంత్ రెడ్డిని విమర్శించడం లేదు.. ప్రజలు నన్ను అడిగేదే నేను సీఎంను అడుగుతున్నా అందులో తప్పేముంది. మంత్రి పదవి కాదు నేను అడుగుతుంది.. మా మునుగోడు ప్రజలకు రోడ్డు వేయించేందుకు పైసలు మాత్రమే ఇవ్వారా అంటూ రేవంత్ రెడ్డి పై విమర్శనాస్త్రాలు వేశారు.
Also Read :Udaya Bhanu : నన్ను వాడుకొని వదిలేశారు.. రెమ్యూనరేషన్ ఎగొట్టారు.. యాంకర్ ఆవేదన..
దీనిపై అధిష్టానం సీరియస్..
కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలకు అధిస్టానం సీరియస్ అయ్యింది. ముందు మంత్రి పదవిపై కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించిన ఆయన అధిష్టానం చూసుకుంటుంది అని తెలిపారు. వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించామన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుంది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించాం
రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటాం
– మహేష్ కుమార్ గౌడ్ https://t.co/ILJod2GpQI pic.twitter.com/Ba8FfU9mEF
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025