Pawan Kalyan Vs Sathya Raj: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వర్సెస్ సత్యరాజ్(Sathyaraj) అనే విధంగా గత మూడు రోజుల నుంచి వివాదం చెల్లరేగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల తమిళనాడు వెళ్లి అక్కడ “మురుగ భక్తల్ మానాడు “(Muruga Bakthargal Manadu ) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలపై కొంత వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలోనే సినీ నటుడు సత్యరాజ్ పవన్ కళ్యాణ్ కు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దని, మేము పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్నామని పవన్ కళ్యాణ్ కు తనదైన స్టైల్ లోనే సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు.
దత్తత తీసుకున్న బిడ్డనే..
ఇప్పటివరకు ఈ వివాదం గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించలేదు కానీ సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బిడ్డను దత్తత తీసుకొని ఆమెనే పెళ్లి చేసుకోవడమే మీ పెరియార్ సిద్ధాంతాలా? అంటూ సత్య రాజ్ ను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ విషయంలో టాలీవుడ్ మౌనం వహించడానికి కారణమేంటనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కట్టప్ప అవుట్…
ఇలా సత్యరాజ్ విషయంలో టాలీవుడ్ పెద్దలు మౌనంగా ఉన్నప్పటికీ ఒక డైరెక్టర్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గురించి సత్యరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇవ్వడంతో డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) కట్టప్పకు ఊహించని శిక్ష వేశారని చెప్పాలి. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh). ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సత్యరాజు కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
స్పందించని పవన్..
పవన్ కళ్యాణ్ గురించి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ సినిమా నుంచి సత్యరాజ్ ను తప్పించారంటూ వార్తలు బయటకు వచ్చాయి. పవన్ గురించి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ శంకర్ నుంచి ఇలాంటి సమాధానం రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం అంటే ఈ డైరెక్టర్ దే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి సత్యరాజ్ ను తప్పించారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరి నటుడు సత్యరాజు చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. మరి ఈ ఘటనపై పవన్ స్పందిస్తారా ?లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: ఈ బుక్ ఆధారంగానే గాడ్ ఆఫ్ వార్ మూవీ… రివీల్ చేసిన తారక్