Film industry:చిత్రసీమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక నటి కం నిర్మాత వయోభారంతో కన్నుమూయడాన్ని పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఆమె మరణానికి చింతిస్తూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆధునిక మరాఠీ నాటక రంగం, భారతీయ ప్యారలల్ సినిమాలకు ఒక కొత్త దిశా నిర్దేశం చేసిన దర్శకురాలు, నిర్మాత , నటి అయిన విజయా మెహతా. అనారోగ్య సమస్యలతో 91వ ఏటా జూన్ 30న మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కళాకారులందరూ ఈమెను ఎంతో ముద్దుగా , గౌరవంగా “బాయి” అని పిలుచుకుంటారు. భారతీయ నాటక రంగానికి ఈమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
విజయా మెహతా మరణ వార్త విన్న వెంటనే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన బాధను వ్యక్తపరుస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నారు. “రావ్ సాహెబ్, పెస్టోంజీ సెట్స్ లో ఆమెతో పనిచేసిన మధురమైన రోజులను గుర్తు చేసుకుంటున్నాను.. ముఖ్యంగా భారతదేశ గర్వించదగ్గ గొప్ప థియేటర్ మైండ్స్ లో ఆమె ప్రథమ స్థానంలో నిలుస్తారు. ఎప్పుడూ తన జ్ఞానాన్ని మాపై రుద్దలేదు. దానిని ఆమె ప్రకాశింపచేశారు. ఏ రోజు మాపై అరిచిన రోజులు లేవు. కానీ మా నటన స్థాయిని ఆమె పెంచారు. నటన అంటే కేవలం పర్ఫార్మ్ చేయడం కాదని, జీవితాన్ని అర్థం చేసుకోవడం అని , ఎంతోమంది నటులకు ఆమె ఈ విషయాన్ని నేర్పించారు” అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
విజయా మెహతా విషయానికి వస్తే.. 1934లో గుజరాత్లోని బరోడా ప్రాంతంలో జన్మించిన ఈమె.. ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ తీసుకుంది. 1960లో ప్రముఖ రచయిత విజయ్ టెండూల్కర్ , నటులు అరవింద్ దేశ్ పాండే ,శ్రీరామ్ లాగులతో కలసి ముంబైలో రంగాయన్ అనే ప్రయోగాత్మక నాటక సంస్థను కూడా స్థాపించారు. ముఖ్యంగా కమర్షియల్ నాటకాలకు భిన్నంగా సామాజిక స్పృహతో కూడిన బోల్డ్ నాటకాలను తెరకెక్కించి మరాఠీ థియేటర్ ముఖచిత్రాన్ని మార్చేసి అందరి దృష్టిని ఆకర్షించారు విజయా..
also read:ఆదర్శ కుటుంబం కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..గూస్ బంప్స్ గ్యారెంటీ!
ఇకపోతే బారిస్టర్, హమీద బాయిచి కోటి, మహాసాగర్, ఏక్ శూన్య బాజీరావు వంటి ఎన్నో అద్భుతమైన నాటకాలకు దర్శకత్వం వహించారు. నాటకాలే కాకుండా 1986లో వచ్చిన రావ్ సాహెబ్, 1988లో వచ్చిన పెస్టోంజీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పైగా ఈ రెండు చిత్రాలు కూడా ఉత్తమ చిత్రాల విభాగంలో అవార్డ్స్ కూడా దక్కించుకున్నాయి. ఇకపోతే ఈమె ఉత్తమ సహాయ నటిగా నేషనల్ అవార్డుతో పాటు సంగీత నాటక్ అకాడమీ పురస్కారము, 1987లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==