Dolly Chaiwala: నాగ్‌పూర్‌కు చెందిన డాలీ చాయ్‌వాలా. ఈ పేరు సోషల్ మీడియాలో మస్త్ ఫేమస్. అతని అసలు పేరు సునీల్ పటేల్. తను డిఫరెంట్ స్టైల్‌లో టీ తయారు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. బిల్ గేట్స్‌కు టీ సర్వ్ చేసిన వీడియోతో డాలీ చాయ్ వాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే, ఇప్పుడు లక్నోలో ఓ ఛాయ్ అమ్మే యువకుడు కూడా డాలీ చాయ్‌వాలా స్టైల్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. లక్నోకు చెందిన ఓ టీ అమ్మే యువకుడు డాలీ చాయ్‌వాలా లాంటి దుస్తులు ధరించి, అతడి స్టైల్ ను ఫాల్లో అయ్యినట్టు కనిపిస్తోంది. ఈ టీ అమ్మే యువకుడు గులాబీ రంగు షర్ట్, బీజ్ ట్రౌజర్స్, వెస్ట్‌కోట్, బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్స్, హైలైటెడ్ జుట్టు, రంగురంగుల సన్ గ్లాసెస్‌తో డాలీ స్టైల్‌ను కాపీ చేశాడు. యాదవ్ లస్సీ భండార్ అనే ఈ షాప్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నోలో ఉంది. ఇక్కడ అతడు డాలీ లాంటి పాలు పోసే శైలిని అనుకరిస్తూ టీ తయారుచేస్తున్నాడు. ‘నేను లక్నో డాలీ చాయ్‌వాలా’ అని చెబుతూ ఆయన టీ పెడుతున్నాడు. అతని చుట్టూ జనం గుమిగూడి టీ తయారీని వీడియో తీస్తున్న దృశ్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
?utm_source=ig_web_copy_link
అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ టీ అమ్మే యువకుడిని ‘మీషో, ఫ్లిప్‌కార్ట్ డాలీ’ అని సరదాగా కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ ఈ వ్యక్తిని ‘డాలీ చాయ్‌వాలా లైట్’ అని చమత్కారంగా కామెంట్ చేశాడు . ఈ వీడియో డాలీ చాయ్‌వాలా ప్రజాదరణను, అతడి స్టైల్‌ను అనుకరించే విధానాన్ని మరింత హైలైట్ చేస్తుంది.
డాలీ చాయ్‌వాలా, నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియం సమీపంలో డాలీ కీ తప్రీ అనే టీ స్టాల్‌ను నడుపుతూ ఫేమస్ అయ్యాడు. అతడి అసాధారణ టీ తయారీ శైలి, రజనీకాంత్, జాక్ స్పారో లాంటి స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాలో 45 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు, 20 లక్షల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను సంపాదించాడు. బిల్ గేట్స్‌తో అతడి వీడియో వైరల్ కావడంతో అతడి ఫేమ్ మరింత పెరిగింది. అతడు రోజుకు 350 నుంచి 500 కప్పుల టీ అమ్మి, రూ.2450 నుంచి రూ.3500 సంపాదిస్తాడని, అతడి నికర విలువ రూ.10 లక్షలు దాటిందని నివేదికలు చెబుతున్నాయి.
ALSO READ: ECIL Jobs: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..
డాలీ చాయ్ వాలా ఫేమస్ కావడంతో లక్నోలో టీ అమ్మే యువకుడు అతని స్టైల్‌ను, టీ తయారీ శైలిని ఖచ్చితంగా అనుకరించడం ఈ వీడియో ప్రత్యేకత. డాలీ స్టైల్‌లో పాలు పోయడం, టీని గ్లాస్ లో పోయడం, షుగర్ వేసి స్టైలిష్‌గా సర్వ్ చేయడం వంటివి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అనుకరణ సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా, ఆసక్తికరంగా మారింది, ఇది డాలీ చాయ్‌వాలా బ్రాండ్ విలువను ఇది స్పష్టం తెలియజేస్తుంది. డాలీ చాయ్‌వాలా విశిష్ట శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుకరణకు గురవుతోంది.