BigTV English
Advertisement

Senior Actress: ఈ సీనియర్ హీరోయిన్‌కు మూడు పెళ్లిళ్లు … ఒక్కో దానికి ఒక్కో రీజన్

Senior Actress: ఈ సీనియర్ హీరోయిన్‌కు మూడు పెళ్లిళ్లు … ఒక్కో దానికి ఒక్కో రీజన్

Senior Actress: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ నటీమణులు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలోనూ, బామ్మ పాత్రలలోను నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి లక్ష్మీ(Lakshmi) ఒకరు. ఈమె సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. లక్ష్మి తల్లి రుక్మిణి నటి కావటం విశేషం అలాగే ఈమె తండ్రి వైవి రావు తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగారు. ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన లక్ష్మీ అతి చిన్న వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.


మూడు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది నటిగా ..

లక్ష్మీ 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి “జీవనాంశమ్” అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్ గా తనని తాను నిరూపించుకుంటూ కొన్ని వందల సినిమాలలో నటించిన ఈమె ఇప్పటికీ అమ్మగాను బామ్మ పాత్రలలోను నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లక్ష్మీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఈమె తన జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు.


చిన్నవయసులోనే వివాహం..

నటి లక్ష్మి కేవలం 15 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు చూసిన అబ్బాయి భాస్కర్(Bashkar) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈమెకు 19 సంవత్సరాలు వచ్చేసరికి ఐశ్వర్య (Aishwaraya) అనే కుమార్తె జన్మించింది. అయితే కుమార్తె పుట్టిన ఏడాదికే తన భర్త భాస్కర్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు. కేవలం వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగానే ఈ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోవడంతో లక్ష్మి 1975 లో సహనటుడు మోహన్ శర్మ(Mohan Sharma) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతోనే 1980వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయారు.

ఆ అహంకారమే విడాకులకు కారణమా?

ఇలా రెండోసారి విడాకులు తీసుకున్న ఈమె ముచ్చటగా మూడోసారి దర్శకుడు, నటుడు శివచంద్రన్ (Siva Chandran)అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.. ఇలా దక్షిణాది ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్గా ఈమె వార్తల్లో నిలిచారు. అయితే మగవాళ్ళు తమ అహంకారం ప్రదర్శించడం వల్లనే విభేదాలు చోటుచేసుకుని విడిపోయానని పలు సందర్భాలలో ఈమె తెలియజేశారు. ఇలా పెళ్లిళ్ల ద్వారా తరచూ వార్తలో నిలుస్తున్న ఆ వార్తలను ఏమాత్రం పట్టించుకోకుండా కెరియర్ పై దృష్టి సారించి ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ లక్ష్మి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: Kannada Actress : రే*ప్ చేస్తాం… హీరో ఫ్యాన్స్ నుంచి హీరోయిన్‌కు బెదిరింపులు

Related News

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Big Stories

×