Snake Video: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం నలుమూలలా ఎక్కడేం జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడీ వీడియోలు, పాముల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైరల్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో 70 ఏళ్ల వృద్ధ మహిళ భారీ పామును చేతితో పట్టుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు బామ్మ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
🐍💪 70 साल की उम्र में भी हौसला जवान!
पुणे के मुलशी तालुका के कासर अंबोली गाँव की शकुंतला सुतार दादी ने जो किया, वो किसी फिल्मी सीन से कम नहीं।
जब उनके घर में धामन सांप निकला, तो दादी ने
ना डर दिखाया
ना हंगामा किया
बल्कि बिना घबराए साँप को खुद पकड़ा
और गले में डालकर लोगों को… pic.twitter.com/eKuoKCntat— Satyaagrah (@satyaagrahindia) July 27, 2025
పుణెలోని ముల్శీ తాలూకాలోని కసర్ అంబోలీ గ్రామంలో ఇంటి పరిసర ప్రాంతాల్లోకి పాము ప్రవేశించింది. అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతలా సుతార్ ఆ పామును గమనించింది. ఈ వృద్ధ మహిళ రాట్ స్నేక్‌ను చేతులతో ధైర్యంగా పట్టుకుంది. అంతటితో ఊరుకుందా అంటే.. ఆ భారీ పామును తన మెడకు చుట్టుకుని కెమెరాలకు ఫోజులిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది ఆమె ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియోలో శకుంతలా, భయం లేకుండా పామును చేతితో పట్టుకుని.. దానిని తన గొంతు చుట్టూ చుట్టుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఆ బామ్మ ఉద్దేశం నెటిజన్లకు షాక్ కు గురి చేయడం కాదు, ప్రజలలో రాట్ స్నేక్ వంటి విషం లేని పాముల గురించి అవగాహన కల్పించడం. శకుంతలా ఈ పాములు ప్రమాదకరం కాదని, అవి పొలాల్లో ఎలుకల సంఖ్యను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సమాజానికి తెలియజేయాలనుకున్నారు.
ALSO READ: Weather News: ఈ ఏడు రోజులు వర్షానికి బ్రేక్.. ఆ తర్వాత మళ్లీ దంచుడే..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని కొనియాడారు. అయితే కొందరు ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు.. ‘పాములను పెంపుడు జంతువులుగా ఉంచలేము.. అవి విషపూరితమైనవి.. వాటితో ప్రాణాలకే ప్రమాదం’ అని కామెంట్ చేశాడు. నిపుణులు కూడా పాములను పట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. రాట్ స్నేక్‌లు విషం లేనివి అయినప్పటికీ, సరైన శిక్షణ లేకుండా వాటిని పట్టుకోవడం ప్రమాదకరం.
ALSO READ: Heart Attack: యువత చేసే ఈ తప్పులే.. హార్ట్ ఎటాక్స్‌కు కారణం అవుతున్నాయట !
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అయ్యింది. ఇది శకుంతలా ధైర్యసాహసాలను ప్రశంసించడమే కాకుండా, పాముల గురించి సామాజిక అవగాహనను పెంపొందించే చర్చలను కూడా దారి తీసింది. విషం లేని పాముల పట్ల భయాన్ని తొలగించి, వాటి పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తు చేశాయి. శకుంతలా సుతార్ ఈ సాహసం, వయసుతో సంబంధం లేకుండా ఆమె ధైర్యం, అవగాహన ద్వారా సమాజానికి సానుకూల సందేశాన్ని అందించవచ్చని నిరూపించింది.