E-Paper
Advertisement

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!
Advertisement

September Clash:ఒకప్పుడు ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చినా స్టార్ హీరో సినిమా అంటే కనీసం రెండు మూడు వారాలు హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడేవి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎంత పెద్ద పండగ సీజన్ అయినా సరే, బాక్సాఫీస్ క్లాష్‌కి దిగితే ఎవరో ఒకరి జేబులకు చిల్లు పడటం ఖాయం. ఒక సంక్రాంతి తప్పితే  మిగిలిన ఏ టైమ్‌లో పోటీపడినా ప్రొడ్యూసర్లకు మిగిలేది బొక్కే.. అయినా సరే, మన నిర్మాతలు మాత్రం ‘రిస్క్ లోనే కిక్ ఉంది’ అంటూ మూకుమ్మడిగా దూసుకువచ్చేస్తున్నారు.. దానికి లేటెస్ట్ ఎగ్జాంపులే సెప్టెంబర్ 11 డేట్.

నిజానికి ముందుగా సెప్టెంబర్ 11 నాదే అని విజయ్ దేవరకొండ తన ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రణబాలి’తో జెండా పాతేశాడు. ఆ రేంజ్ క్రేజీ ప్రాజెక్ట్ తో పోటీ పడటం ఎందుకని మిగిలిన వాళ్ళంతా సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు. కానీ, ఎప్పుడైతే రణబాలి ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అవుతోందనే లీక్ బయటకొచ్చిందో, ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఖాళీగా ఉన్న స్లాట్‌ను చూసి చిన్న, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమైపోయాయి. ఇక అక్కడి నుంచి అసలు రచ్చ మొదలు.

Advertisement

also read :ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?

ముందుగా సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాతో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేసి “మేము సెప్టెంబర్ 11నే వస్తున్నాం” అని అఫీషియల్ గా లాక్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, అన్నయ్య విజయ్ తప్పుకున్న ఖాళీని తమ్ముడు ఆనంద్ దేవరకొండ భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. వైష్ణవి చైతన్యతో కలిసి నటిస్తున్న ‘ఎపిక్ ది ఫస్ట్ సెమిస్టర్’ మూవీని అదే రోజున దింపేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు రవితేజ ఫ్యామిలీ నుంచి మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న ‘మారెమ్మ’ చిత్రం కూడా ఇప్పటికే అదే డేట్‌ను అనౌన్స్ చేసి క్లాష్‌కు సై అంది.

Advertisement

ఇంతటితో ఆగారా లేదు ..ఈసారి నేను కూడా అంటూ  బరిలోకి దిగాడు జక్కన్న.వారణాసి తో కాదు లెండి .రాజమౌళి ప్రెసెంట్ చేస్తున్న  ఫహద్ ఫాసిల్ నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ కూడా సెప్టెంబర్ 11నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపొయింది. దీనికి తోడు కోలీవుడ్ నుంచి కార్తీ నటిస్తున్న డబ్బింగ్ సీక్వెల్ ‘సర్దార్ 2’ కూడా తెలుగులో ఉన్న మంచి క్రేజ్‌ను వాడుకోవడానికి అదే డేట్‌పై కన్నేసింది.మొతానికి ఈ చిన్న-మిడ్ రేంజ్ సినిమాలన్నీ సెప్టెంబర్ 11నే సేఫ్ జోన్‌గా భావిస్తున్నాయన్న మాట.

ఇన్ని సినిమాలు ఒకే రోజు క్యూ కడితే థియేటర్ల సర్దుబాటు సంగతి దేవుడెరుగు, అసలు ఏ సినిమా చూడాలో అర్థం కాక ప్రేక్షకుడికి మైండ్ బ్లాక్ అవ్వడం మాత్రం ఖాయం. ఆడియన్స్ అంతా ఫైనల్‌గా యూట్యూబ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ మీద ఆధారపడాల్సిందే. ఏదేమైనా రిలీజ్ డేట్ దాకా ఈ సినిమాలన్నీ మాట మీద ఉంటాయా లేదా చివరి నిమిషంలో మనసు మార్చుకుని వేరే డేట్ వెతుక్కుంటాయా అనేది కాలమే డిసైడ్ చేయాలి . ఏది ఏమైనా సెప్టెంబర్ 11 బాక్సాఫీస్ ఫైట్ మాత్రం మామూలుగా ఉండేలా లేదు..!

also read :బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

Related News

సినిమా పైరసీకి కేంద్రం షాక్.. వేల వెబ్‌సైట్లు బ్లాక్!

బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?

మన చదువుల పీక కోసేస్తున్న AI.. ఆర్జీవీ సంచలనం!

జయకృష్ణ ఎంట్రీకి ఫుల్ జోష్.. ‘ఉక్కిరి బిక్కిరి’ సాంగ్ వైరల్!

“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!

అదే నాకు భారతరత్న.. అవార్డులపై స్పందించిన సీనియర్ హీరో సుమన్!

Big Stories

Advertisement
×