Prakasam district: తండ్రి అప్పు తీర్చలేదని తన కుమార్తెను కిడ్నాప్ చేశాడో వ్యాపారి. అప్పు చెల్లంచక పోతే.. నీ కుమార్తెను చంపుతానంటూ ఆ తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి బాలికను సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
ALSO READ: జరిగింది ఇదే..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన శ్రీనివాసరావు.. గతంలో పని కోసం తిరుపతికి వలస వెళ్లాడు. అతనికి ఒక కూతురు కూడా ఉంది. అయితే అక్కడ కుటుంబం కోసం డబ్బులు అవసరం ఏర్పడింది. అప్పు కోసం ఈశ్వర్‌రెడ్డిని సంప్రదించాడు. దీంతో ఈశ్వర్‌రెడ్డి శ్రీనివాసరావుకు సుమారు రూ.5లక్షల వరకు అప్పుగా ఇచ్చాడు. పని చేసుకుంటూనే శ్రీనివాసులు అప్పుగా తీసుకున్న డబ్బును కొంతమేర చెల్లించాడు. జీవనం భారం కావడంతో తిరుపతి నుంచి శ్రీనివాసరావు మువ్వవారిపాలెం వచ్చేశాడు. అప్పటి నుంచి ఈశ్వర్‌రెడ్డికి అందుబాటులో లేడు. దీంతో.. శ్రీనివాసరావుకు కూతురు ఉందని, తను చీమకుర్తిలో చదివే స్కూల్ లో చదువుతుందని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్ళిన ఈశ్వర్ మీ నాన్న ఇంటికి తీసుకురమ్మన్నాడంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు.
ALSO READ: Eesha Rebba: చిలిపి ఫోజులతో కొంటెగా కవ్విస్తున్న ఈషా రెబ్బ.. ఫోటోలు వైరల్!
స్వీట్లు కొనిస్తానని చెప్పి ఒంగోలుకు తీసుకొచ్చాడు ఈశ్వర్‌రెడ్డి. ఆ తర్వాత శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళ్తున్నానని అప్పు చెల్లించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. భయాందోళన చెందిన శ్రీనివాసరావు పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్కూల్ వద్దకు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటే జీ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఈశ్వర్ రెడ్డిగా గుర్తించారు. వెంటనే అతడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కావలి దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిడ్నాపైన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అదుపులో తీసుకున్న ఈశ్వర్ రెడ్డిని విచారిస్తున్నారు. శ్రీనివాసరావును కూడా విచారించి ఈకేసును పరిస్కరిస్తామని పోలీసులు తెలిపారు.
తండ్రి అప్పు చెల్లించలేదని కూతురిని కిడ్నాప్ చేసిన వ్యాపారి..
ప్రకాశం జిల్లా మువ్వావారిపాలెంలో ఘటన
తిరుపతిలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చిన ఈశ్వర్ రెడ్డి
శ్రీనివాసరావు అప్పు తీర్చకపోవడంతో మువ్వావారిపాలెంకి వెళ్లిన ఈశ్వర్ రెడ్డి
శ్రీనివాసరావు కుమార్తె… pic.twitter.com/QlaFzamfgA
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025