Shah Rukh Khan injured: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) తాజాగా గాయపడినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. షారుక్ ఖాన్ తాజాగా ఒక సినిమా షూటింగ్ సెట్లో గాయపడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ‘కింగ్’ సినిమా సెట్ లో ఆయనకు గాయాలయ్యాయని.. ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారట. అయితే ఈ వార్తలు విన్న షారుఖ్ ఖాన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . మరొకవైపు ఈ వార్తలకు సంబంధించి షారుఖ్ ఖాన్ పర్సనల్ మేనేజర్ పూజా దద్లాని నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఇకపోతే దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
కింగ్ మూవీ షూటింగ్ సెట్ లో గాయపడ్డ షారుఖ్..
బాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్రం కూడా ఒకటి. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాణి ముఖర్జీ, జయదీప్ అహ్లావత్, హర్షద్ వార్షి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్లోనే ఇప్పుడు ఈయన గాయపడినట్లు సమాచారం.
అత్యవసర పరిస్థితుల్లో అమెరికాకు పయనం..
ఇకపోతే ప్రస్తుతం కింగ్ సినిమా షూటింగ్ ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో జరుగుతోంది. అయితే ఇక్కడే గాయపడ్డారని.. ప్రస్తుతం అత్యవసర వైద్య సహాయం కోసం తన టీం తో కలిసి షారుక్ ఖాన్ అమెరికాకు బయలుదేరినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే షారుక్ ఖాన్ కండరాలకు తీవ్రంగా గాయం అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో కూడా కండరాల సమస్యతోనే షారుఖ్ ఖాన్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో కూడా అదే సమస్య ఎదురయ్యిందని అందుకోసమే చికిత్స కోసం అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం. అయితే దీనిపై అభిమానులకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా బాలీవుడ్ మీడియా తెలిపింది.
షారుఖ్ ఖాన్ కెరియర్..
షారుఖ్ ఖాన్ కెరియర్ విషయానికి వస్తే.. సినీ నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. దాదాపు ఇప్పటివరకు 80కి పైగా సినిమాలలో నటించిన ఈయన.. ఆసియాలో ప్రముఖ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. తన సినీ కెరియర్ లో 14 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. టీవీ సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. 1992లో దీవానా అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు షారుఖ్ ఖాన్.
ALSO READ:Vijay Deverakonda: ఓరేయ్ మీరు అన్నమే తింటున్నారా ? వీడియో ఎడిటర్స్‌పై హీరో స్పెషల్ పోస్ట్.?