BigTV English
Advertisement

Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?

Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?

Sharwanand: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన శర్వానంద్ హీరోగా కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించుకున్నారు. శర్వానంద్ కెరియర్ లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. గమ్యం, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఒకే ఒక జీవితం వంటి గొప్ప సినిమాలు శర్వానంద్ కెరియర్ లో ఉన్నాయి.


శర్వానంద్ కెరియర్ లో హిట్ సినిమాలు కంటే కూడా ప్లాప్ సినిమాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. కథలు ఎంచుకునే విషయంలో శర్వానంద్ కొంచెం తక్కువ పరిజ్ఞానం అనే చెప్పాలి. అయితే కష్టంలో మాత్రం ఎటువంటి లోపం ఉండదు. కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద శర్వానంద్ చేసిన సినిమాలు ఫెయిల్ అయినా కూడా హీరోగా శర్వానంద్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

షాకింగ్ లుక్ లో శర్వానంద్ 

శర్వానంద్ ఒక హిట్ సినిమా చేసి చాలా ఏళ్లు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మనమే సినిమా కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.


అయితే 2026లో శర్వానంద్ ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. యువి క్రియేషన్స్ లో బైకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2026 లో విడుదల కానుంది.

శర్వానంద్ చూడడానికి కొంచెం బొద్దుగా ముద్దుగా ఉంటాడు. వాస్తవానికి శర్వానంద్ కొంచెం బొద్దుగా ఉంటేనే చూడడానికి కూడా చాలామందికి బాగుంటుంది. కానీ కొన్ని సినిమాలు విషయంలో తగ్గాల్సి వచ్చింది కాబట్టి శర్వానంద్ దారుణంగా తగ్గిపోయాడు. ఎవరు పోల్చుకోలేనంత రేంజ్ లో మారిపోయాడు. ఒక లేటెస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లుక్ చూస్తుంటే షాకింగ్ గా అనిపిస్తుంది. సిక్స్ ప్యాక్ కూడా శర్వానంద్ కష్టపడి చేశాడు.

సంక్రాంతి సెంటిమెంట్

2026 సంక్రాంతి కానుకగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమా కూడా విడుదలవుతుంది. అయితే గతంలో సంక్రాంతికి విడుదలైన శతమానం భవతి అనే సినిమా శర్వానంద్ కు మంచి సక్సెస్ ఇచ్చింది. ఇక నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా సక్సెస్ అయితే మరోసారి సంక్రాంతి కలిసి వచ్చినట్లే.

Also Read: Peddi : పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే, చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Related News

Priya prakash Varrier: కన్ను గీటిన పిల్లలో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు నమ్మలేరు..

Baahubali The Epic Trailer : బాహుబలి తిరిగి వచ్చాడు, మైండ్ చెదిరిపోయే ట్రైలర్ కట్

Sukumar: కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సుకుమార్ వైఫ్, కుమారి 22 F తో మొదలు

NTR Dragon : ఆఫ్రికాకు ప్రయాణమవుతున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ పరిస్థితి ఏంటి?

Sachin Sanghvi: మహిళపై లైంగిక వేధింపులు .. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్

Megastar Chiranjeevi : 2026 లో మూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్

Upasana: ఉపాసన సీమంతపు వేడుకలలో కనిపించని అల్లు ఫ్యామిలీ.. మళ్ళీ దూరం పెరిగిందా?

Big Stories

×