E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu : రేపు పొద్దున్నే ఫుల్ సాంగ్ విడుదల, ట్రోల్స్ ప్రభావంతోనే నిర్ణయం?

Mana Shankara Vara Prasad Garu : రేపు పొద్దున్నే ఫుల్ సాంగ్ విడుదల, ట్రోల్స్ ప్రభావంతోనే నిర్ణయం?
Advertisement

Mana Shankara Vara Prasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేసిన ఆ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా సినిమా గతంలో పండగ సందర్భంగా వస్తుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా విషయంలో ఉన్న భారీ విఎఫ్ఎక్స్ కారణంగా ఆ సినిమా పలు సందర్భాలలో వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ కంప్లీట్ గా పూర్తి అయితేనే ఆ సినిమాను విడుదల చేయటానికి యూవి క్రియేషన్స్ ప్లాన్ చేస్తుంది. ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ మీసాల పిల్లలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

శశిరేఖ కాధ్యాయిని

Advertisement

ఇప్పుడు ఈ సినిమా నుంచి శశిరేఖ అని ఒక పాటను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నేడు విడుదల చేశారు. అయితే ఈ ప్రోమో వీడియో వింటుంటే లిటిల్ హార్ట్స్ సినిమాలోని కాత్యాయిని భోంచేసేవా అనే పాట మాదిరిగానే ఉంది అని విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. బహుశా ఈ కామెంట్స్ అన్నీ కూడా చిత్ర యూనిట్ దృష్టికి వెళ్లినట్లు ఉన్నాయి.

అందుకే ఈ పాటను రేపు 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేస్తున్నారు. మామూలుగా అయితే ఒక ప్రోమో విడుదలైన రెండు మూడు రోజులు తర్వాత ఆ పాట విడుదల చేస్తుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమా పాటని కూడా రేపు 11 గంటలకు విడుదల చేస్తున్నారు అంటే ట్రోలింగ్ ను చిత్ర యూనిట్ బాగా సీరియస్ గా తీసుకున్నారు అని చెప్పొచ్చు.

ఆ రేంజ్ లో ఉంటుందా?

Advertisement

మరోవైపు ఈ పాట ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. అనిల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే కూడా సక్సెస్ సాధిస్తుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి లుక్స్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి లేకపోతే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

Also Read: JanaNayagan : భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్లే, ఆ పాత్రలో గౌతమ్ వాసుదేవ్

Tags

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×