Visakha Express Security Alert: పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద దోపిడీ దొంగలు ప్రయాణికుల్ని దోచుకునేందుకు ప్రయత్నించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన కలకలం రేపింది. న్యూ పిడుగురాళ్ల రైల్వే సమీపంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థను దుండగులు ట్యాంపరింగ్ చేయడంతో సిగ్నల్ నిలిచిపోయింది. దీంతో ఆ సమయంలో విశాఖ నుంచి చర్లపల్లి బయల్దేరుతున్నస్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు లోకోపైలెట్ రైలును ఆపేశారు. వెంటనే దుండగులు రెండు బోగీల్లోకి వెళ్లి ఇద్దరు మహిళల మెడలో బంగారం ఆభరణాలు లాక్కొని వెళ్లారు. ఈ ఘటనతో 4.12 గంటల నుంచి 5.30 వరకు నిలిచిపోయింది. రైలులోకి ప్రవేశించిన దొంగలపై అప్రమత్తమైన పోలీసులు.. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు వెంటనే అక్కడినుండి పరారయ్యారు. పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్ళలో చోరీకి పాల్పడుతోంది.
గత వారంలో విశాఖ – చర్లపల్లి స్పెషల్ ట్రైన్ చోరీ జరిగింది. S-4, S-7 బోగీల్లో తెల్లవారుజామున సమయంలో నిద్రిస్తున్న ప్రయాణికుల మెడలో బంగారు ఆభరణాలు లాక్కొరు దొంగలు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలోనే ఘటన జరిగింది.
ప్రాథమికంగా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఈ దొంగల ముఠా బీహార్, మహారాష్ట్రకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో సుమారు ఏడుగురు సభ్యులు ఉన్నట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. గడచిన వారం రోజుల్లో రెండు సార్లు చోరీ ఘటన జరగడం.. ప్రయాణికుల్లో గుబులు రేపుతోంది. తెల్లవారుజామన సమయంలోనే ఈ ఘటనలు జరిగాయి.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా, ప్రయాణికుల మధ్య భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి వేళ ప్రయాణించే వారిలో భద్రతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి . రైల్వే పోలీసులు వెంటనే స్పందించి కాల్పులు జరిపిన దృష్ట్యా ప్రమాదం తప్పింది. ఘటన అనంతరం రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి చోరీకు పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు.. రైల్వే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు పోలీసులు. రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల పక్కన గల జనరల్ ప్రాంతాల్లో.. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదు.
Also Read: ఇక్కడ పవర్ కట్ అంటే నవ్వులే.. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ ఉందిగా!
ఈ ఘటన మరోసారి రైలు ప్రయాణాల్లో భద్రత ప్రాధాన్యత ఎంత మరోసారి గుర్తుచేసింది. రాత్రి రైళ్లలో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరింత బలమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.