Shruti Haasan Stopped by Security: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ మూవీ ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున, ఆమిన్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యారాజ్ వంటి స్టార్స్ నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. కన్నడ నటి రచిత రామ్ సహానటి పాత్ర పోషించింది. అయితే కూలీ మూవీ రిలీజ్ సందర్బంగా తన సినిమా చూసేందుకు స్నేహితులతో కలిసి థియేటర్ వెళ్లిన శ్రుతి హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది.
థియేటర్ ముందు ఆపేసిన సెక్యురిటీ
ఆమె థియేటర్ లోపలికి వెళ్తుండగా.. సెక్యూరిటీ ఆమెను ఆపేశాడు. రిలీజ్ డే రోజు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశ్ మహదేవన్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఈ సంఘటన బయటకు వచ్చింది. అయితే ఇందులో సెక్యూరిటీ తమ కారుని అడ్డుకోవడంతో శ్రుతి స్పందించిన తీరు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇంతకి అసలేమైందంటే.. కూలీ మూవీ రిలీజ్ సందర్భంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు స్నేహితులతో కలిసి చెన్నైలోని వెట్రి థియేటర్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను గుర్తుపట్టని సెక్యూరిటీ గార్డ్ శ్రుతి కారుని అడ్డుకున్నాడు. లోపలికి వెళ్లకుండ బయటే నిలివేశాడు.
నేనే హీరోయిన్ సర్…
ఇదంత లోపల ఉన్న తన స్నేహితుల్లో ఒకరు వీడియో తీశారు. సెక్యూరిటీ అడ్డుకోవడంతో శ్రుతి ఇలా స్పందించింది. “నేను ఈ సినిమాలో ఉన్నాను సర్. నన్ను లోపలికి అనుమతించండి. నేనే హీరోయిన్ సార్” అంటూ శ్రుతి రిక్వెస్ట్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కాస్తా థియేటర్ యాజమాన్యం కంటపడింది. దీనిపై సదరు థియేటర్ యాజమాని స్పందిస్తూ.. మా మనిషి రాయాల్. తన కర్తవ్యాన్ని నిబద్దతగా నిర్వర్తిస్తున్నారు. ఇది హిలెరియస్ మూమెంట్. మాకు సపోర్టు చేసినందకు ధన్యవాదాలు మేడం. మీరు షోని బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం” అంటూ ఈ వీడియోని రీట్వీట్ చేశారు.
My man Raayal over performed his duty 🫡 😆
Hilarious moment 😝
Thanks for being with us @shrutihaasan mam … Hope you enjoyed the show !!!#CoolieFDFS in #Vettri
Video credits – Yungraja pic.twitter.com/l0NRkrE6XU
— Rakesh Gowthaman (@VettriTheatres) August 15, 2025
కాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కూలీ మూవీ మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. ముందు నుంచి మూవీపై హైప్ ఉండటంతో టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. దీంతో ఫస్ట్ డే రూ. 151 కోట్టకు పైగా గ్రాస్, రూ. 68 కోట్లనెట్ కలెక్షన్స్ చేసింది. ఇక మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో రెండో రోజు కూలీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రెండో రోజు ఈ మూవీ రూ. 48.5 కోట్ల నెట్ మాత్రమే చేసినట్టు తెలుస్తోంది. ముందు నుంచి వార్ 2 కంటే కూలీకే ఎక్కు వ బజ్ ఉంది. కానీ, రెండో రోజుతో సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు వార్ 2, కూలీని అధికమించింది. సెకండ్ డే కూలీ కంటే వార్ 2కే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం.
Also Read: Chiranjeevi: జాతీయ జెండాను గౌరవించడం తెలీదా… ఇండస్ట్రీ పెద్దపై నెటిజన్లు సీరియస్