BigTV English

Bigg Boss New Voice: బిగ్ బాస్‌నే మార్చిపడేశారు… వాయిస్ ఏంటి ఇలా ఉంది ?

Bigg Boss New Voice: బిగ్ బాస్‌నే మార్చిపడేశారు… వాయిస్ ఏంటి ఇలా ఉంది ?

Bigg Boss New Voice :బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతర భాషలతో పాటు తెలుగులో కూడా ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 9 (Bigg Boss 9) వ సీజన్ ప్రసారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఇకపోతే ఈ సీజన్లో విభిన్నమైన టాస్కులను ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. ఈ టాస్కులు గెలవాలి అంటే యుద్ధం చేయాల్సిందే.. ఈసారి చదరంగం కాదు, రణరంగం అంటూ వరుసగా విడుదల చేస్తున్న ప్రోమోలు ఈ సీజన్ పై మంచి అంచనాలను పెంచేస్తున్నాయి. ఇకపోతే ఇటీవల ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగార్జున(Nagarjuna) మాట్లాడుతూ.. ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్ అని తెలియజేశారు. అలాగే బిగ్ బాస్ నే మార్చేసామని కూడా తెలియజేశారు.


సామాన్యులకు ఇది అగ్నిపరీక్ష…

ఇలా బిగ్ బాస్ మారిపోయాడని చెప్పడంతో.. అభిమానులు కూడా అసలు బిగ్ బాస్ మారిపోవడం ఏంటీ ? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం అగ్నిపరీక్ష (Agnipariksha) అనే కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఇక ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా బిగ్ బాస్ , అభిజిత్ మధ్య కొంత సంభాషణ జరుగుతుంది.


మారిపోయిన బిగ్ బాస్ వాయిస్..

ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు బిగ్ బాస్ వాయిస్(Bigg BossVoice) గమనించారు. గత ఎనిమిది సీజన్లలో బిగ్ బాస్ వాయిస్ అందరికీ బాగా గుర్తుండిపోయింది. అయితే ఒక్కసారిగా ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ వాయిస్ మారిపోయింది. గతంలో బిగ్ బాస్ మాట్లాడితే ఆ మాటలలో ఎంతో గాంబీర్యం ఉండేది కానీ తాజాగా బిగ్ బాస్ వాయిస్ వింటుంటే మాత్రం సాధారణ వ్యక్తులు మాట్లాడిన విధంగానే ఉంది. దీంతో అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ వాయిస్ మారిపోవడంతో.. అసలు బాలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం.. ఓల్డ్ వాయిస్ కి ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యారు.. ఒక్కసారిగా ఇలా కొత్త వాయిస్ వినిపించేసరికి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారని వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి కొంతమంది బిగ్ బాస్ రేటింగ్ దృష్టిలో పెట్టుకొని గత కొన్ని సీజన్లు అనుకున్న స్థాయిలో బిగ్ బాస్ టీ ఆర్పీ రేటింగ్ చేరుకోలేకపోయింది. ఇలాంటి సమయంలోనే ఇలాంటి సరికొత్త ప్రయోగాలు చేయటం అవసరమా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం వర్షాలు కారణంగా బిగ్ బాస్ కు జలుబు చేసినట్టు ఉంది అంటూ ఫన్నీగా సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి ఈ వాయిస్ కేవలం అగ్ని పరీక్ష ఎపిసోడ్ కు మాత్రమే ఉంటుందా? లేదంటే బిగ్ బాస్ 9 సీజన్ మొత్తం ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Nagarjuna: హోటల్‌ క్లీన్ చేసిన నాగార్జున…  అసలు విషయం చెప్పిన జగపతిబాబు!

Related News

Bigg Boss Agnipariksha: నాలో స్వీట్ చాక్లెట్ బాయ్ నే చూశారు… భయపెడుతున్న అభిజిత్

Bigg Boss Agni Pariksha: అగ్ని పరీక్షకు ఎంపికైంది వీరే.. రేయ్ ఎవర్రా మీరంతా?

Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Big Stories

×