BigTV English

Team India Injury: టీమిండియాకు బిగ్ షాక్.. నలుగురు ప్లేయర్లకు గాయాలు.. ఇంగ్లాండ్ నుంచి ఇంటికి రిటర్న్.. ఒంటరిపోయిన గిల్!

Team India Injury: టీమిండియాకు బిగ్ షాక్.. నలుగురు ప్లేయర్లకు గాయాలు.. ఇంగ్లాండ్ నుంచి ఇంటికి రిటర్న్.. ఒంటరిపోయిన గిల్!

Team India Injury: 5 టెస్టుల అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో వెనుకబడిన భారత జట్టు.. నాలుగవ మ్యాచ్ లో గెలిచి స్కోర్ ని సమం చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 – 1 తో ఆదిక్యంలో ఉంది. ఈ క్రమంలో మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జూలై 23 నుండి 27 వరకు జరిగే నాలుగోవ టెస్ట్ లో భారత జట్టు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Also Read: KL Rahul: ఒకప్పుడు బ్యాట్ కూడా అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పుడు లార్డ్స్ మ్యూజియంలోనే Kl రాహుల్ వస్తువులు

అయితే ఈ మైదానంలో ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవని భారత జట్టు.. ఇక్కడ చరిత్ర సృష్టించాలంటే బలమైన జట్టును రంగంలోకి దించాల్సి ఉంది. ఈ క్రమంలో నాలుగవ టెస్ట్ కి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్నెస్ గురించి ప్రస్తుతం ఆందోళనలు నెలకొన్నాయి. పంత్ ఒక్కడే కాకుండా భారత జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు గమనిస్తే..


భారత జట్టులో బిగ్ చేంజ్:

మూడవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తొలి రోజు వికెట్ కీపింగ్ చేస్తున్న సందర్భంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతడి ఎడమ వేలికి గాయం అయ్యింది. అయినప్పటికీ రెండు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన పంత్.. మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో త్వరగా అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని వేలిలో నొప్పి తీవ్రమవుతుందని స్పష్టంగా తెలిసింది. ఈ క్రమంలో నాలుగోవ టెస్టు ప్రారంభానికి ముందు రిషబ్ పంత్ కోలుకోకపోతే.. భారత జట్టు తరుపున ముగ్గురు వికెట్ కీపర్లు మైదానంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతడు కోలుకోలేక, కేవలం బ్యాట్స్మెన్ గా ఆడించే అవకాశాలు ఉంటే.. ఇండియా వికెట్ కీపర్ గా వేరొకరిని ఎంచుకోవాల్సిన సందర్భం వస్తే.. కేఎల్ రాహుల్, దృవ్ జురెల్ రూపంలో భారత జట్టుకు రెండు ఎంపికలు ఉన్నాయి.

నాలుగో టెస్ట్ కోసం ధోని శిష్యుడికి పిలుపు:

అలాగే 4 వ టెస్ట్ కి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టెస్ట్ జట్టులోకి యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ ని బిసిసిఐ చేర్చింది. ఈ క్రమంలో నాలుగవ మ్యాచ్ కి పెసర్లు అర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా..? లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే లార్డ్స్ లో జరిగిన మూడవ టెస్ట్ లో ఆకాశ్ దీప్ గాయపడ్డాడు. మరోవైపు నాలుగో టెస్ట్ కోసం ప్రాక్టీస్ సందర్భంగా అర్షదీప్ చేతి వేలికి గాయమైంది. అర్షదీప్ కోలుకోవడానికి దాదాపు పది రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అన్షుల్ కాంబోజ్ కి తొలిసారి సెలెక్టర్లు పిలుపునిచ్చారు. దీంతో అతడు ఉన్నపలంగా భారత్ నుండి లండన్ కు బయలుదేరి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Also Read: IPL 2026: KKR జట్టులోకి సంజు, రానా… వెంకటేష్ అయ్యర్ ఔట్.. షారుక్ ఖాన్ భారీ ప్లాన్?

మరోవైపు ప్రస్తుతం భారత జట్టులోని ఆల్ రౌండర్లలో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డికి చిన్నపాటి గాయం కావడం, అలాగే తన బ్యాటింగ్ ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం 45 పరుగులే చేశాడు. బౌలింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఈ క్రమంలో అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ కి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉందట బీసీసీఐ. ఇంగ్లాండ్ పరిస్థితులలో శార్దూల్ అనుభవంతో కూడిన స్వింగ్ బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో తన స్వింగ్ బౌలింగ్ తో కీలకపాత్ర పోషించగలడని, బ్యాటింగ్ లోను సత్తా చూపించగలరని బిసిసిఐ భావిస్తుందట. ఈ క్రమంలో నాలుగోవ టెస్ట్ కి నితీష్ కుమార్ రెడ్డి ని కూడా పక్కనపెట్టి శార్థుల్ ఠాకూర్ కి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

Related News

Shreyas Iyer – BCCI: శ్రేయాస్ అయ్య‌ర్ కు అదిరిపోయే ఆఫ‌ర్‌..బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌.. ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025: దుబాయ్ లో అడుగుపెట్టిన టీమిండియా…జెర్సీలో ఈ మార్పు గ‌మ‌నించారా

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Big Stories

×