Sushant singh: దివంగత సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2013లో విడుదలైన ‘కాయ్ పో చె’ అనే చిత్రం ద్వారా వెండితెరకు మొట్టమొదటిసారిగా పరిచయమయ్యాడు. ఈయన నటించిన ‘ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాలో ఈయన పాత్రకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకి మొదటి నామినేషన్ అందుకున్నాడు . కేదార్నాథ్ , చిచోరే వంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి. నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సీరియల్స్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా అవతరించారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన అద్భుతమైన నటన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ కెరియర్ పీక్స్ లో దూసుకుపోతున్న సమయంలో సడన్గా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది.
కెరియర్ పీక్స్ లో ఉండగానే 2020 జూన్ 14న కరోనా సమయంలో ఆయన తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని, హత్య అని.. అయితే ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇప్పటికీ తెలియలేదు.. అంటూ సుశాంత్ సింగ్ సోదరి శ్వేత సింగ్ ఎమోషనల్ కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ధోని అలా ప్రవర్తించడం బాధగా అనిపించింది అంటూ కూడా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
తాజాగా ఒక ప్రముఖ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేత సింగ్ (Swetha Singh) తన సోదరుడి మరణంపై మాట్లాడుతూ.. “సుశాంత్ మేనేజర్ అయిన దిశా శైలన్ మరణంతో సుశాంత్ తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. తన వద్ద ఉన్న సమాచారాన్ని బయట పెడితే తనకు ప్రమాదం ఉందని, తెలిస్తే తనను బెదిరిస్తారని సుశాంత్ భావించాడు. అయితే అతను మరణించే సమయానికి సుశాంత్ గొంతుపై ఒక సన్నని గీత ఉంది.
ALSO READ:11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?
ఇది ఆత్మహత్య చేసుకునేటప్పుడు కనిపించదు. మేము ఇండియాలో ఒక డాక్టర్ ను, అమెరికాలో మరొక డాక్టర్ ను సంప్రదించాము. అయితే వారు స్పష్టంగా మాకు తెలియజేసింది ఏమిటంటే.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురయ్యాడని.. ఇద్దరూ చెప్పారు. నేను ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు కూడా గదిలో స్టూల్ లేదు. పైగా అది లోపలి నుండి తాళం వేసి ఉంది. నిజానికి సుశాంత్ కి గది లోపలి నుండి తాళం వేయడం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా సుశాంత్ హత్య చేయబడ్డాడు. అయితే ఆరేళ్లు గడిచినా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో మాకు ఇప్పటికీ తెలియడం లేదు” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదే సమయంలో ధోని గురించి ఆమె ప్రస్తావిస్తూ… “సుశాంత్ మరణించిన తర్వాత మా కుటుంబాన్ని ధోని పరామర్శించలేదు. కంగనాతో పాటూ మరికొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే మాట్లాడారు. నేను అమెరికాలో ఉండగా సుశాంత్ మరణ వార్త తెలిసింది. సూసైడ్ గురించి తెలియ గానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. కరోనా కారణంతో ఇండియాకి రాలేకపోయాను. సోదరుడికి వీడ్కోలు చెప్పలేకపోయాను అనే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది” అంటూ శ్వేతా సింగ్ కన్నీళ్లు పెట్టుకుంది.