E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది
Advertisement

Tanveer Ahmed On Virat Kohli Retirement:  టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (IND VS WI) మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ సెంచరీ తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. సెంచరీ చేయడమే కాకుండా మరోసారి చేజింగ్ మాస్టర్ తానేనని నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Pak Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఉన్నాడు కాబట్టి వన్డేలలో టీమిండియా వరుసగా విజయాలు నమోదు చేస్తుందని హేళన చేశారు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో… అప్పటినుంచి టీమిండియాను దేవుడు కూడా కాపాడలేడని బాంబు పేల్చారు. విరాట్ కోహ్లీ లేకపోతే ఉగాండా కంటే దారుణంగా టీమిండియా తయారవుతుందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఇలా జరగకపోతే.. పాకిస్తాన్ వీధులలో బట్టలు లేకుండా తిరుగుతానని శపధం చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియాను కాపాడడం ఎవరి తరం కాదు

వెస్టిండీస్ పై సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించారు తన్వీర్ అహ్మద్. ప్రపంచంలోనే విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ఆటగాడు అని కొనియాడారు. అందుకే టీమిండియా ప్రతి మ్యాచ్ లో విజయం సాధిస్తోందని వ్యాఖ్యానించారు. 40 సంవత్సరాలు దగ్గర పడినా కూడా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మాత్రం అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

విరాట్ కోహ్లీ జోరు ఇలాగే కొనసాగితే 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియాను ఎవరు ఆపలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు తన్వీర్ అహ్మద్. విరాట్ కోహ్లీ దూకుడు రోహిత్ శర్మ అటాకింగ్ తోడు అవుతే టీం ఇండియాను తట్టుకోవడం ప్రత్యర్థికి కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం టీమిండియాను కాపాడడం ఎవరి తరం కాదన్నారు. అతడు వన్డేలలో కొనసాగినన్ని రోజులు మాత్రమే టీమిండియా విజయాలను నమోదు చేసుకుంటుందని… లేకపోతే ఉగాండా కంటే దారుణంగా జట్టు తయారవుతుందని హెచ్చరించారు.

2027 వన్డే వరల్డ్ కప్ తర్వాతే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?

Advertisement

టీమిండియాలో అద్భుతంగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు. వన్డేలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు కూడా గుడ్ బై చెప్పే యోచనలో కోహ్లీ ఉన్నాడట.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Tags

Related News

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

Big Stories

Advertisement
×