E-Paper
Advertisement

రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేస్తాం

రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేస్తాం
Advertisement

Irfan Pathan On Border–Gavaskar Trophy:  బంగ్లాదేశ్ చేతిలో డార్విన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును దారుణంగా విమర్శలు చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం అత్యంత దారుణం అంటున్నారు. స్వయంకృపరాధం కారణంగానే ఆస్ట్రేలియా ఓడిపోయిందని రికీ పాంటింగ్ లాంటివాళ్ళు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు మాజీ టీమిండియా ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ( Border–Gavaskar Trophy) ఆస్ట్రేలియా జట్టును టీమిండియా వైట్ వాష్ చేయడం గ్యారెంటీ అని హెచ్చరించారు.

రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేస్తాం

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోవడం అందరూ చూశారన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా చాలా బలహీనంగా ఉందని.. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఐసీసీ ట్రోఫీలలో కూడా ఆస్ట్రేలియా పెద్దగా రాణించడం లేదని గుర్తు చేశారు. రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా జట్టు… ఆస్ట్రేలియన్ ఓడించాలని కోరారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వీక్ గా ఉన్న నేపథ్యంలో దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. వాళ్లను వైట్ వాష్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో టీమిండియా జట్టును ఆస్ట్రేలియా ఓడించిందని.. ఆ ప్రతీ కారం ఇప్పుడు తీర్చుకోవాలని కోరారు.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 టోర్నమెంట్ ఎప్పుడంటే ?

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చాలా సంవత్సరాలుగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 టోర్నమెంట్ జనవరి 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మార్చి మూడవ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ లోపు శ్రీలంకతో పాటు వెస్టిండీస్ జట్లతో టెస్ట్ సిరీస్ ఆడనుంది టీం ఇండియా. ఆ తర్వాత జనవరి 21వ తేదీన 2027 లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షురూ అవుతుంది. మార్చి మూడవ తేదీ వరకు ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగుతాయి. ఈ సారి జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఇండియాలోనే జరగనుంది. WTC ఫైనల్ రేసులో టీమిండియా నిలవాలంటే కచ్చితంగా ఈ టెస్టులు గెలవాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో టీమిండియా ఉండాలంటే మరో ఏడు మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. 2027 వరకు మొత్తం టీమిండియా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో ఏడుకంటే ఒక్కటి తక్కువ అయినా, టీమిండియా కు WTC ఛాన్స్ ఉండదు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×