BigTV English
Advertisement

SIIMA 2024 Scam : భారీ మోసం… హీరోయిన్లకు లక్షల్లో ఎగ్గొట్టిన సైమా ?

SIIMA 2024 Scam : భారీ మోసం… హీరోయిన్లకు లక్షల్లో ఎగ్గొట్టిన సైమా ?

SIIMA 2024 Scam : SIIMA (సౌత్ ఇండియ ఇంటర్నెషనల్ మూవీ అవార్డ్స్ ) ప్రతి ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. ఇది సౌత్ ఇండియాలోనే టాప్ అవార్డ్స్‌గా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ఈ SIIMAపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది హీరో, హీరోయిన్లకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఓ టాప్ హీరో కూడా ఈ SIIMA ఇవ్వాల్సిన డబ్బుల గురించి పది మందిలో మాట్లాడుతున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.


2024లో SIIMA అవార్డు ఫంక్షన్‌‌ను భారీగా చేసింది. 2024 సెప్టెంబర్ 14, 15. ఈ రెండు తేదీల్లో దుబాయ్‌లో అట్టహాసంగా ఈవెంట్ జరిపారు. దీంట్లో బెస్ట్ మూవీగా రజినీకాంత్ ‘జైలర్’ అవార్డు అందుకుంది. బెస్ట్ యాక్టర్‌గా చియాన్ విక్రమ్ కి ‘పొన్నియన్ సెల్వన్ 1’ మూవీకి గాను అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్టరస్ గా నయనతారకు ‘అన్నపూర్ణి’ మూవీకి గాను అవార్డు వచ్చింది.

ఇవి అన్నీ పక్కన పెడితే, ఈ అవార్డ్ ఫంక్షన్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు మరి కొన్ని కార్యక్రమాలు చేశారు. దీనికి కోసం ఆయా హీరో, హీరోయిన్‌లతో SIIMA రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారు. అందుకు అనుకూలంగా ఒప్పందం కూడా చేసుకున్నారు. ఒక్కో హీరోయిన్‌‌కు వాళ్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా డబ్బులు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు.


అలా ఓ స్టార్ హీరోయిన్ చేసిన పర్ఫార్మెన్స్‌కి 50 లక్షల రెమ్యునరేషన్ ఒప్పుకున్నారు. ఆమె దాదాపు ఒక్కో సినిమా సాధారణంగా 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ SIIMA ఈవెంట్‌ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం 50 లక్షలకు అంగీకరించింది.

డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఆమె డ్యాన్స్‌కి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. అయితే ఆమెకు ఇప్పటి వరకు SIIMA వాళ్లు కేవలం 30 లక్షలు మాత్రమే ఇచ్చారట.

మిగితా 20 లక్షలు ఇవ్వడానికి SIIMA వాళ్లు రెడీగా లేరట. ఆ స్టార్ హీరోయిన్‌ పలు మార్లు దీని గురించి అడిగినా… వారి నుంచి రెస్పాన్స్ లేదట. దీంతో తనకు SIIMA వాళ్లు 20 లక్షల వరకు ఎగ్గొట్టారని ఆ హీరోయిన్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతుందట.

ఒప్పదం చేసుకున్న తర్వాత, దాన్ని తప్పుతూ.. హీరోయిన్‌కు 20 లక్షలు ఎగ్గొట్టడం ఏంటి అంటూ SIIMAని ఇండస్ట్రీ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఒక నటి కష్టాన్ని దోచుకోవడం సరికాదు అంటూ ఫైర్ అవుతున్నారు.

SIIMA వాళ్లు ఈ ఒక్క హీరోయిన్‌కే కాదు… చాలా మంది నటీ నటులకు ఆ 2024 దుబాయి అవార్డ్స్ ఈవెంట్ కు సంబంధించి పేమెంట్స్ ఇవ్వలేదు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరి ఇందులో నిజం ఉందా ? రెమ్యునరేషన్ ఎగ్గొట్టడం వెనక ఉన్న కారణాలు ఏంటి ? అనేవి తెలియాలంటే SIIMA నుంచి రిప్లే రావాల్సిందే. మరి వాళ్లు రియాక్ట్ అవుతారా ? చూడాలి మరి.

Related News

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Big Stories

×