E-Paper
Advertisement

సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!

సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!
Advertisement

https://twitter.com/thedeverakonda/status/2106601655517241422?s=48Singeetham Srinivas Rao: ప్రయోగాత్మక చిత్రాలకు వేదికగా నిలిచి, భారతీయ చలన చిత్ర రంగాన్ని మురిపించిన ప్రముఖ దిగ్గజ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు (Singeetham Srinivas Rao) తుది శ్వాస విడిచారు.. శనివారం అనగా అక్టోబర్ 3వ తేదీన రాత్రి చెన్నైలోని కావేరి అనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన స్వర్గస్తులయ్యారు. వయసు పై బడడంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడవడంతో చిత్ర సీమలో ఒక అద్భుతమైన సృజనాత్మక శకం ముగిసింది.ఆయన మరణం పై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

నిజమైన దార్శనికుడికి సంతాపం – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సింగీతం శ్రీనివాసరావు మరణ వార్త తెలుసుకొని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఇలా రాసుకొచ్చారు. “దిగ్గజ చిత్ర నిర్మాత సింగీతం శ్రీనివాస్ రావు గారి మరణ వార్త విని తీవ్రంగా దుఃఖిస్తున్నాను. ఒక నిజమైన దార్శనికుడైన ఆయన నూతన ఆలోచనలను అన్వేషించడంలో కనబరిచిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరుపురాని చిత్రాలను అందించాయి. సినిమాకు ఆయన చేసిన సేవకు అపారమైన గౌరవంతో ఆప్యాయతతో ఎల్లప్పుడూ గుర్తించుకుంటారు. ఆయన ఇటీవలి చిత్రం ‘సింగ్ గీతం’ . కథలు చెప్పడం పట్ల ఆయనకున్న అంతులేని అభిరుచికి ఒక అందమైన నిదర్శనం. ఆయన హృదయపూర్వకంగా ఎప్పటికీ యవ్వనంగా, జిజ్ఞాసతో, సృజనాత్మకత పట్ల తపనతో ఉండేవారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.. మిమ్మల్ని మిస్ అవుతాం సింగీతం గారు. మీ చిత్రాలు తరతరాల ప్రేక్షకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి.. ఓం శాంతి” అంటూ తెలిపారు.

Advertisement

ఈ నష్టం జీవితంలో పూడ్వలేనిది – మంచు విష్ణు

“నేను దీనిని ఒక సంతాప సందేశంలా కాకుండా ఆయన పనితీరుతో సినిమాపై ప్రేమ పెరిగిన ఒక వ్యక్తి నుండి వస్తున్న వ్యక్తిగత వీడ్కోలుగా చెప్పాలనుకుంటున్నాను. ఈ నష్టం నాకు చాలా వ్యక్తిగతంగా బాధ కలిగిస్తోంది. నేను ఎదుగుతున్న రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు నాకు ఇష్టమైన దర్శకులలో ఒకరు. వాటి వెనుక ఉన్న కళాత్మకతను పూర్తిగా అర్థం చేసుకోక ముందే నేను ఆయన చిత్రాలను ఎంతో ఆశ్చర్యంగా చూసేవాడిని. నేను పెద్దయ్యాక సినిమా రంగంలో భాగమైన కొద్దీ ఆయన పైన అభిమానం మరింత బలపడింది. ఆయన సినిమాను నిజంగా ప్రేమించిన వ్యక్తిని నేను. తన ఊహలో నిర్భయంగా ఉంటూ నిరంతరం ప్రయోగాలు చేస్తూ ఏ ఒక్క జానర్ కు గాని, ఫార్ములాకు గాని తనను తాను పరిమితం చేసుకోలేదు. ఆయన తీసిన ప్రతి సినిమా మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. ప్రతి సినిమా ఒక పాఠ్య పుస్తకం లాంటిది. నా వరకు సినిమాల మాయాజాలంతో నన్ను ప్రేమలో పడేలా చేసిన చిత్ర దర్శకులలో ఆయన ఎప్పటికీ ఒకరిగా నిలిచిపోతారు. మనం ఒక నిజమైన దిగ్గజాన్ని కోల్పోయాం.. కానీ ఆయన సినిమా చిరకాలం నిలిచి , తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి , ప్రియమైన వారికి నా హృదయపూర్వక సంతాపం. సింగీతం గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ తెలిపారు.

94 ఏళ్ల వయసులో కూడా తగ్గని సినిమా ప్రేమ – పవన్ కళ్యాణ్..

Advertisement

శ్రీ సింగీతం శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. భారతీయ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలను రూపొందించారు. పుష్పక విమానం, విచిత్ర దుకాణాలు, మయూరి , ఆదిత్య 369, మైఖేల్ మదన కామరాజు వంటి చిత్రాలలో ఆయన చేసిన ప్రయోగాలు, ప్రదర్శించిన సృజనాత్మక దృక్పదాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి చిత్రాలలోని పాటలు మంచి ప్రజాదారణ పొందాయి. 94 ఏళ్ల వయసులో కూడా సింగ్ గీతం చిత్రానికి దర్శకత్వం వహించడం సినిమా పట్ల ఆయనకున్న అంతులేని అభిరుచిని వెల్లడించింది అంటూ సంతాపం వ్యక్తం చేశారు.

also read: ఎస్కేఎన్ చేతుల మీదుగా ‘ధరణి ఐ లవ్ యు’ పోస్టర్ లాంఛ్!

ఇక వీరితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు , ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావుకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

https://www.instagram.com/stories/nandamurikalyanram/3990916083976459387?utm_source=ig_story_item_share&stkn=MXU1b3k2ZXM3cnQ1cQ==

 

 

Related News

అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?

సింగీతం సినిమాల గురించి.. నూటికో కోటికో ఒక్కరంటూ, నేటితరం దర్శకులు ఏమన్నారు?

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!

ఇలా తయారయ్యారేంట్రా? ‘చుట్టమల్లే’ సాంగ్ పై విజయ్ దేవరకొండ ఫైర్

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?

సుకుమార్ అపార్ట్‌మెంట్ కిందే నాలుగేళ్లు.. శ్రీకాంత్ ఓదెల పడ్డ కష్టం ఇదే!

‘వారణాసి’ రుద్ర పాత్ర పై రాజమౌళి కామెంట్… ఇది అసలు ఊహించలేదంటూ!

Big Stories

Advertisement
×