Dharani I love you Movie:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఎస్ కే ఎన్. నిర్మాత గానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా పేరు దక్కించుకున్న ఈయన మాస్ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకులు కూడా.. దర్శకుడు, రచయిత సాయి రాజేష్ తో పాటు గీత ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ వంటి బ్యానర్లతో తరచుగా పనిచేస్తూ ఉంటారు ఎస్కేఎన్. ముఖ్యంగా చెన్నై లవ్ స్టోరీ, ఆయ్, బేబీ , మంచి రోజులు వచ్చాయి , కలర్ ఫోటో వంటి చిత్రాలకు సహనిర్మాతగా, నిర్మాతగా వ్యవహరించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ తో నిత్యం వార్తల్లో నిలిచే ఈయన తాజాగా ‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్ ను లాంఛ్ చేశారు.
చిత్ర బృందం సమక్షంలో జరిగిన ఈ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది.ఈ సందర్భంగా ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ” ‘ధరణి ఐ లవ్ యు’ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. టైటిల్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ కలుగుతోంది. ధరణి ఐ లవ్ యు మూవీ డైరెక్టర్ సాయికృష్ణ కె.వి. కి ఇది సెకండ్ మూవీ.. తను రాజమౌళి గారి దగ్గర మగధీర మూవీకి అసోసియేట్ గా వర్క్ చేసారు.. నిర్మాత రాజశేఖర్ గారికి,చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ తెలిపారు.
డైరెక్టర్ సాయికృష్ణ కె.వి మాట్లాడుతూ..” కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారి చేతులు మీద మా ‘ధరణి ఐ లవ్ యు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది.. ఆయన ఇండస్ట్రీలో టైమింగ్ ఉన్న ప్రొడ్యూసర్.. బేబీ, చెన్నై లవ్ స్టోరీ.. ఇలా వరుస విజయాలతో బిజీగా ఉండి..ధరణి ఐ లవ్ యు పోస్టర్ లాంచ్ చేసినందుకు చాలా థాంక్స్.. ఆయన స్టేజ్ మీద ఒక రైమింగ్ తో టైమింగ్ లో ఇచ్చే స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.. అందులో నేను ఒకడిని” అన్నారు
also read:వందల కోట్లు పోగొట్టుకున్న హీరో నవదీప్?
నిర్మాత, హీరో, హీరోయిన్స్ చిత్ర బృందం మాట్లాడుతూ.. తమ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఎస్ కే ఎన్ చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయికృష్ణ కె.వి, నిర్మాత రాజశేఖర్ మద్దికుంట, హీరో వంశీ, హీరోయిన్ మహిత, రైటర్ బాలసూర్య చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
సమర్పణ – శ్రీమతి బాలామణి
మాటలు- కామన వి.సాయి, బాలసూర్య
పాటలు – ఉమా వంగూరి, చాందిని,విశ్వనాధ్ కారసాల
మ్యూజిక్- పద్మనాబ్ భరద్వాజ్
ఎడిటింగ్- నందమూరి హరి,ఎన్.టి.ఆర్
సినిమాటోగ్రఫీ- చిన్నయోగి అన్నెం
ఆర్ట్-జగన్.బి
ఫైట్స్ – దేవరాజ్,నందు, జీవన్
కొరియోగ్రఫీ- చంద్రకిరణ్
కాస్ట్యూమ్స్-లోకేష్
మేకప్- రాఘవ
స్టిల్స్- కృష్ణ, శ్రీను
డైరెక్షన్ డిపార్ట్మెంట్ – బ్రహ్మజీ, వెంకటేష్, శ్రీను, మహిపాల్
పబ్లిసిటీ- నవీన్ నంద్యాల
పి.ఆర్.ఓ- కడలి రాంబాబు
నిర్మాత- రాజశేఖర్ మద్దికుంట,
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం – సాయికృష్ణ.కె.వి