Sivakarthikeyan: కోలీవుడ్ ఇండస్ట్రీలో టీవీ యాంకర్ గా పని చేస్తూ తన టాలెంట్ తో సినిమా అవకాశాలు అందుకుని వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan)ఒకరు. ఒకప్పుడు కేవలం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిన శివ కార్తికేయన్ ఇటీవల తెలుగులో కూడా భారీ స్థాయిలో మార్కెట్ సొంతం చేసుకున్నారు.. గత రెండు సంవత్సరాలుగా ఈయన నటించిన సినిమాలకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి. ఇక తెలుగులో కూడా శివ కార్తికేయనుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అమరన్(Amaran) సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ త్వరలోనే మదరాశి సినిమా(Madarasi Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (A.R.Muragadas)దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ద్వారా మురగదాస్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తారని సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలు గురించి తెలియజేశారు.
రజనీకాంత్ గారు ఆదర్శం…
తనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేదని అయితే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) గారిని స్ఫూర్తిగా తీసుకొని తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని శివ కార్తికేయన్ వెల్లడించారు. సినిమాల పరంగా రజనీకాంత్ గారు నాకు ఆదర్శం ఆయనే నా సర్వస్వం అతనిని చూసే తాను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా శివ కార్తికేయన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఒక సాధారణ బస్ కండక్టర్ గా కొనసాగుతున్న రజనీకాంత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు.
విలన్ గా విద్యుత్ అజ్మల్..
శివ కార్తికేయన్ కూడా తనకు రజనీకాంత్ గారు స్ఫూర్తి అని చెప్పటం విశేషం. మదరాసి సినిమా విషయానికి వస్తే.. మురగదాస్ డైరెక్షన్ లో శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. అక్రమ ఆయుధాలు తమిళనాడు సిటీ లోకి తీసుకొని రావడం పై హీరో చేసే పోరాటమే ఈ సినిమాకు ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. సాధారణ జీవితాన్ని గడుపుతున్న హీరో ఈ అక్రమ ఆయుధాల వ్యవహారంలోకి ఎలా వెళ్లారనే నేపథ్యంలోనే సినిమా ఉండబోతోందనితెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో విద్యుత్ అజ్మల్ నటిస్తున్నారు. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Baaghi 4Trailer: రక్తంతో నిండిన ప్రేమ కథ…హై వోల్టేజ్ యాక్షన్ గా బాఘీ 4 ట్రైలర్!