Snigdha Nayani:స్నిగ్ధ నయని…పేరు చెప్పగానే అంత ఈజీగా గుర్తుపట్టలేకపోవచ్చు కాని చూస్తే మాత్రం ఓ తినేనా ఈజీగానే గుర్తుపట్టేస్తాం.ఎప్పుడు అబ్బాయి గెటప్ లో కనిపించే స్నిగ్ధ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడి తన పెళ్లి గురించి ,ముఖ్యంగా తను లెస్బియనా కాదా ,తనకున్న pcos ప్రాబ్లం గురింఛి పలు ఆసక్తి కరమైన విషయాలని చెప్పుకొచ్చింది.
లెస్బియనా కాదా అన్న ప్రశ్న కి సమాధానంగా
స్నిగ్ధ పెళ్లి గురించి మాట్లాడుతూ తనకి అమ్మాయి అయినా ,అబ్బాయి అయినా ఒకే అని జెండర్ గురించి తానెప్పుడు అసలు పట్టించుకోనని తను చూసేదల్లా ఆ వ్యక్తికి ప్యూర్ సోల్ ఉందా లేదా అన్నాడు మాత్రమే తాను చూస్తానని చెప్పుకొచ్చింది.అలాంటి వ్యక్తి దొరికితే తాను ఖచ్చితంగా కలిసి ప్రయాణించడానికి సిద్దమని తెలిపింది.ఇక పెళ్లి గురించి తనని పదే పదే అడుగుతుంటారని, తన జవాబు మాత్రం ఇదేనని తేల్చి చెప్పింది.తను లెస్బియనా కాదా అన్న ప్రశ్న కి సమాధానంగా తాను లెస్బియన్ కానే దాదని కుండ బద్దలు కొట్టింది.
వెంట్రుకల గురించి మాట్లాడుతూ
ఇక తన మొహం పై వచ్చే వెంట్రుకల గురించి మాట్లాడుతూ తనకు pcos సమస్య ఉందని,అయినా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదని గత నాలుగైదు ఏళ్లుగా ఉందనే విషయం చెబుతూనే ఉన్నానని చెప్పుకొచ్చింది.అయితే హార్మోన్ల గురించి ఎవరూ అర్థం చేసుకోకుండా తన బాడీ గురించి,పెరిగే వెంట్రుకల గురించి మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటారని, ఇక ఒక సినిమాలో రోల్ కోసం తన లుక్స్ గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయని వాపోయింది.
అయితే థ్రెడింగ్ చేయించుకుంటే వెంట్రుకలు కనిపించవని,కానీ రెండు నెలల పాటు పార్లర్ కి వెళ్ళకుండా ఉంటే మాత్రం వెంట్రుకలు బాగా పెరిగిపోతాయని అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇది తెలీని కొంతమంది వారం వారం ఇలా వెంట్రుకలు పెరిగిపోతున్నాయని అంటుంటారని తెలిపింది.
2 లేదా 3 నెలలకి ఒకసారి నెలసరి
ఇక తన నెలసరి గురించి మాట్లాడుతూ తనకున్న pcos సమస్య వల్ల నెలసరి కూడా సరిగ్గా రాదని, 2 లేదా 3 నెలలకి ఒకసారి వస్తుందని తెలిపింది.ఇక వచ్చినప్పుడు కూడా భరించలేని నొప్పి ఉంటుందని తన బాధని బయట పెట్టింది. అయితే pcos లక్షణాలు ఒక్కొకరిలో ఒకోలా ఉంటాయని ,ఆ సమస్య ఉన్న వారు డాక్టర్ ని సంప్రదించి మందులు వాడటం మంచిదని సూచింది స్నిగ్ధ .
ఇక ఈ సందర్భంగానే తానెందుకు సినిమాలలో కనిపించలేదనే విషయాన్ని రివీల్ చేసింది స్నిగ్ధ. గత మూడేళ్ళుగా తాను తక్కువ షూటింగ్ లలో పాల్గొంటున్నానని, దీనికి కారణం ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేయడమేనని,షూటింగ్ లో నటించడం కన్నా షూటింగ్ వెనకాల జరిగే పనులని ,నిర్మాణానికి సంబందించిన పనులని చూసుకోవడమే తనకి ఇష్టమని చెప్పుకొచ్చింది స్నిగ్ధ !
ALSO READ :బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!
కెరీర్ విషయానికి వస్తే
ఇక ఇక స్నిగ్ధ కెరీర్ విషయానికి వస్తే నాని,నిత్య మీనన్ కలిసి నటించిన అలా మొదలైంది సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్నిగ్ధ ఆ తర్వాత మేము వయసుకు వచ్చాం’, ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘ధమ్ము’, ‘ఒక్కడినే’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘అంతకుముందు ఆ తరువాత’ ‘గుంటూరు టాకీస్’, ‘జత కలిసే’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘పీఎస్‌వీ గరుడ వేగ’, ‘ఓ! బేబీ’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెల్సిందే !