E-Paper
Advertisement

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?

మీ ఉరిలో భూమి రీ-సర్వే ఎప్పుడు జరుగుతుందో తెలుసా.. పూర్తి షెడ్యుల్ ఇదే?
Advertisement

Telangana Resurvey: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు శాశ్వత ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ రీ–సర్వే’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో వేగంగా, పగడ్బందీగా ముందుకు సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, చిన్నపాటి పొరపాట్లు, భూ తగదాలకు తావులేకుండా ఈ ప్రక్రియను ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ రీ-సర్వే ప్రక్రియ కేవలం సర్వేయర్ల పరిధికే పరిమితం కాకుండా, తహసీల్దార్ ప్రత్యక్ష పర్యవేక్షణ, అప్రూవల్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో భాగంగా నక్షా (మ్యాప్) లేని 365 గ్రామాలు, అలాగే ప్రతి జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,768 గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. రాబోయే నవంబర్ చివరి నాటికి మొదటి దశ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది.

ప్రతి మండలంలో ప్రత్యేక సర్వే బృందాలు..

రీ-సర్వే వేగవంతంగా జరిగేందుకు వీలుగా ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో తప్పనిసరిగా సర్వే చేపడుతున్నారు. ప్రతి మండలానికి రెండు ప్రత్యేక సర్వే బృందాలను రంగంలోకి దించారు.ఈ టీమ్ లో లైసెన్స్‌డ్ సర్వేయర్, జీపీవో , డిప్యూటీ తహసీల్దార్ , ఆర్‌ఐ ,సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు సభ్యులుగా ఉంటారు. మరో వైపు సర్వే కేవలం కాగితాలకో, టెక్నాలజీకో పరిమితం కాకూడదని భావించిన ప్రభుత్వం…ఎమ్మార్వోలకు క్షేత్రస్థాయి పర్యటనలను తప్పనిసరి చేసింది. ప్రతిరోజు వీరు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను స్వయంగా పరిశీలించాలి. అంతే గాక రోజూ ఎక్కడ సర్వే జరిగింది? ఎన్ని ఎకరాలు, ఏ సర్వే నంబర్లు పూర్తయ్యాయి? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా? అనే అంశాలపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని సేకరించి రీ-సర్వే నివేదికలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి డైలీ రిపోర్ట్ పంపాలి.

Advertisement

Also Read: కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

14 మంది ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ..

రీ-సర్వే ప్రక్రియ క్వాలిటీతో, నిరంతర పర్యవేక్షణలో సాగేలా ప్రభుత్వం 7 జోన్లుగా విభజించింది.ప్రతి జోన్‌కు రెవెన్యూ , సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది ప్రత్యేక అధికారులను పర్యవేక్షకులుగానియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే నాణ్యతను, ప్రజల అభిప్రాయాలను నమోదు చేస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక ‘రియల్ టైమ్’ డాష్ బోర్డు..

Advertisement

సరిహద్దుల నిర్ణయంలో అధునాతన ‘లైవ్ మ్యాపింగ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రస్థాయి నుంచిప్రతీఅడుగునుపర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక డాష్ బోర్డును అందుబాటులోకి తెస్తున్నారు. సర్వే పురోగతి, రోవర్ల డ్రైవ్, లైవ్ లొకేషన్లు, రోజువారీ పనితీరు అంతా ఈ డాష్ బోర్డు ద్వారా సెకన్ల వ్యవధిలో రాష్ట్ర అధికారులు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే సర్వేకు కావలసిన రోవర్లు, సాంకేతిక పరికరాలు, నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేస్తోంది.

అవినీతికి తావులేదు.. ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి..

ప్రభుత్వ భూముల సర్వే, సరిహద్దులగుర్తింపుసమయంలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.ఇక రీ-సర్వే పేరుతో రైతులు, స్థానిక ప్రజల నుంచి పైసా వసూలు చేసినా సహించేది లేదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ప్రజలను ఇబ్బంది పెట్టినా, అక్రమాలకు పాల్పడినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read: హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

Tags

Related News

నంబర్ ప్లేట్లు లేని కార్లతో ఆర్టీఓ అధికారుల తనిఖీలు.. దీనికి మతలబేంటో..?

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

సిరిసిల్ల సభ చేదు అనుభవం తనకూ కలగకుండా… ముందే అప్రమత్తమైన వైనం… సిద్దిపేట సభతో బల ప్రదర్శన..!

విశాఖలో ఎన్నికల సందడి.. నోటిఫికేషన్‌కు ముందే అధికారుల స్పీడ్!

తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్ మైండ్ గేమ్స్‌కు రివర్స్ కౌంటర్!

Big Stories

Advertisement
×