Skeleton Found: హైదరాబాద్, నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్తిపంజరం కలకలం రేగింది. మీకు ఒక వీడియో చూపిస్తానంటూ ఓ యువకుడు పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లాడు. ఇంటి లోపలకి వెళ్లిన యువకుడు మనిషి అస్థిపంజరం చూపిస్తూ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. యువకుడిని స్టేషన్ కు పిలిచి హబీబ్ నగర్ పోలీసులు వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో కొంత మంది యువత క్రికెట్ ఆడుతున్నారు. అయితే క్రికెట్ ఆడే క్రమంలో బాల్ పాడు బడిన ఇంట్లోకి బాల్ పడింది. దీంతో బాల్ తీసుకునేందుకు యువకుడు అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో అస్తిపంజరం కనిపించడంతో మరుసటి రోజు వీడియో తీశానని పోలీసులకు యువకుడకు వివరించాడు. హబీమ్ నగర్ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు అస్థిపంజరం ఎవరిదని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆ ఇంటి వివరాలను పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏడు సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని ఇంటి ఓనర్ విదేశాల్లో ఉంటారని స్థానికులు వివరించారు. గత కొంత కాలం నుంచి కుటుంబ సభ్యుల మద్య ఆస్థి వివాదాలు తలెత్తడంతో ఇంట్లో ఎవరు ఉండడం లేదని చెప్పారు. గతంలో అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో నివసించినట్టు ఇంటి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అమీర్ ఖాన్ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ALSO READ: BHEL Recruitment: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ నీదే బ్రో
ఈ క్రమంలో పోలీసులు అమీర్ ఖాన్ సోదరుడు షాదాబ్ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. ‘అమీర్ ఖాన్ గత పది సంవత్సరాలుగా మా కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు. అమీర్ ఖాన్ మానసిక పరిస్థితి అసలు బాగోలేదు. కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా అమీర్ ఖాన్ వద్దకు ఇప్పటివరకు ఎవరు వెళ్లలేదు. ఏడేళ్ల క్రితం మా పెద్ద అన్న అమీర్ ఖాన్ ను అదే ఇంటి వద్ద చూశాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఎలా ఉన్నాడో.. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఏడేళ్ల నుంచి ఆ ఇంటి వైపు ఎవరు వెళ్లలేదు. ఎక్కడో పనిచేసుకుంటూ ఉంటాడని భావించాం’ అని అతను పోలీసులకు వివరించాడు.
ALSO READ: Kavitha Vs Mallanna : కవితను పిచ్చి తిట్లు తిట్టిన మల్లన్న.. ఈసారి మరింత ఊర మాస్
లాక్ డౌన్‌కు ముందు అమీర్ ఖాన్ అదే ఇంట్లో ఉండేవాడని మిగతా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ అస్థిపంజరం అమీర్ ఖాన్ దా..? లేక అమీర్ ఖానే ఎవరినైనా చంపి వెళ్లిపోయారా..? అలాగే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ఇంటికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.