Sp Charan : టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సింగర్ గా తండ్రికి మించిన తనయుడుగా ఎన్నో పాటలను ఆయన గొంతుతో ఆలపించారు. ఈమధ్య సినిమాలో సంగతి ఏమో కానీ బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో షోలలో ఎస్పీ చరణ్ సందడి చేస్తుంటారు. ఆ షోలలో ఆయన లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంటారు. ప్రస్తుతం పాడుతా తీయగా అనే షోకు హోస్ట్ గా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీ చరణ్ కు ఓ డైరెక్టర్ అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? ఎందుకు అయినా కేసు పెట్టాడు అన్న విషయం గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఇంటి అద్దె చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ సినీ సహాయ దర్శకుడిపై గాయకుడు ఎస్పీ చరణ్ కేకేనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాలిగ్రామంలోని సత్యా గార్డెన్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో తమకు ఓ ఫ్లాట్ ఉందని, అందులో తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న తిరుజ్ఞానం అద్దెకు ఉంటున్నారు. నెలకు రూ.40,500 చెల్లిస్తానని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆయన నుంచి అడ్వాన్స్‌గా రూ.1.50 లక్షలు తీసుకున్నానన్నారు. గత 25 నెలలుగా తిరుజ్ఞానం అద్దె చెల్లించడం లేదని, ఇటీవల ఆయన్ను అడగతే, తనతో అసభ్యకరంగా మాట్లాడి, బెదిరింపులకు దిగాడన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, అద్దె డబ్బులు ఇప్పించి ఇంటిని ఖాళీ చేయించాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి తనయుడు ఎస్పీ చరణ్.. ఈయన సింగర్ గా మాత్రమే కాదు నటుడుగా కూడా ప్రేక్షకులను అలరించారు. తెలుగుతో పాటుగా పలు భాషల్లో అయినా పాటలు కూడా పాడి ఆయన తండ్రి పేరును పెంచుతున్నారు. ఈయన ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే వీళ్ళకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. కొన్ని మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2005లో వీళ్ళిద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత చరణ్ ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది. ఈ విషయం ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇక ప్రస్తుతం ఆయన కెరియర్ విషయానికి వస్తే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంటున్నాడు.