E-Paper
Advertisement

మద్యం మత్తులో ఖాకీల కారుకు యాక్సిడెంట్.. పోలీసుల కారులో డ్రగ్స్, మద్యం కలకలం!

మద్యం మత్తులో ఖాకీల కారుకు యాక్సిడెంట్.. పోలీసుల కారులో డ్రగ్స్, మద్యం కలకలం!
Advertisement

Police Car: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవర్పాడు దగ్గర ఆటోను పోలీసుల కారు ఢీకొంది. ఆటో బోల్తాపడి నలుగురికి గాయాలయ్యాయి. ఇక్కడే ట్విస్ట్ ఉంది. పోలీసులు మద్యంమత్తులో కారు నడుపుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. కారును అడ్డుకొని నిలదీయగా.. ఆ కారులో బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైలు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. అంతే కాదు కారులో గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లను గుర్తించారు. స్థానికులు వీడియోలు కూడా తీశారు.

గంజాయి ప్యాకెట్లు ఎవరివి?

మరి ఈ గంజాయి ప్యాకెట్లు ఎవరివి? యాక్సిడెంట్ జరగకపోతే గంజాయి చేరాల్సిన చోటికి చేరి ఉండేదా అన్న డౌట్లను స్థానికులు వినిపించారు. ఇది కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో పోలీసులే గంజాయి రవాణా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. మద్యంమత్తులో యాక్సిడెంట్‌ చేయడమే కాకుండా జనాన్ని బెదిరించడమేంటని క్వశ్చన్ చేశారు.

Advertisement

Also Read: తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు

ఇందులో ఏది నిజం

కారులో పట్టుబడ్డ గంజాయి, మద్యంబాటిళ్లకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని డీఎస్పీ బాలమురళీకృష్ణ క్లారిటీ ఇచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పట్టుకునే క్రమంలో పోలీసుల కారు ఆటోను ఢీకొట్టిందన్నారు. అతడు పోలీసులను చూసి మద్యం బాటిళ్లు, గంజాయి వదిలేసి పరారయ్యాడని, వాటినే పోలీసులు కారులో తీసుకొని ఆ వ్యక్తిని వెంబడిస్తుండగా పోలీసుల కారు ఆటోని ఢీకొట్టిందన్నారు. ఇందులో ఏది నిజం అన్న పాయింట్ చుట్టూ చర్చ నడుస్తోంది.

Advertisement

Also Read: ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన నవదీప్.. వీడియో వైరల్!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×