Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను భారీగా నిర్వహిస్తున్నారు. ఒక వైపు రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోవైపు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఐఫోన్లు వాడకం గురించి ప్రస్తావనకు రావడంతో.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. చాలామంది ఇతరుల ముందు గొప్పగా కనిపించడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారని తెలిపారు. ఈ అలవాటును మార్చుకోవాలని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇతరుల ముందు గొప్పగా కనిపించాలనే ఆలోచనతో అప్పులు చేసి ఖరీదైన ఫోన్లు కొనడం సరైన పద్ధతి కాదని హీరో విజయ్ సూచించారు. సెలబ్రిటీలకు చాలా సందర్భాల్లో ఫోన్లు గిఫ్ట్‌గా వస్తుంటాయని, అందుకే కొత్త ఫోన్లు కొనాల్సిన అవసరం ఉండదన్నారు.డబ్బు ఉన్నా లేకపోయినా కేవలం స్టేటస్ కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లేవారు కాస్త కామన్‌సెన్స్ ఉపయోగించుకోవాలని తన అభిమానులకు విజయ్ సూచించారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలను స్పూర్తిగా తీసుకుంటూ చాలామంది వారిని అనుకరిస్తూ వారి స్టైల్ ఫాలో అవుతుంటారు. అయితే ఈ పద్ధతిని మార్చుకోవాలని వీటి కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదని విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రణబాలి(Ranabaali) బ్రిటిష్ పాలన వ్యతిరేకత నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఒక యోధుడిగా కనిపించబోతున్నారు.
ఇక ఇందులో విజయ్ దేవరకొండకు జోడిగా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. ఈమె జయమ్మ పాత్రలో కనిపించబోతున్నారు. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు 8 ఏళ్ల నుంచి విజయ్ దేవరకొండకు సరైన హిట్ మాత్రం పడలేదని చెప్పాలి. మరి రణబాలి సినిమాతోనైనా విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడేనా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!