Anaconda Video: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం నలుమూలలా ఎక్కడేం జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడీ వీడియోలు, పాముల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైరల్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి నీటిలో నుంచి భారీ అనకొండాను నీటిలో నుంచి చేతులతో పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో డైలాన్ జోసెఫ్ సింగర్ అనే వ్యక్తి ద్వారా పోస్ట్ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ వీడియో కాస్త భయభ్రాంతులకు కూడా గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వివరాల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో ఓ వ్యక్తి మురికి నీటిలో ఉన్న భారీ అనకొండాను తన నైపుణ్యంతో సునాయాసంగా పట్టుకున్నాడు. ఈ వీడియో ఉన్న క్యాప్షన్ ప్రకారం.. ఈ అనకొండాను పట్టుకుని సురక్షితంగా అడవిలోకి వదిలేశారు. ఇది ఒక వన్యప్రాణి సంరక్షణకు సంబధించిన ప్రయత్నంలో భాగం అని తెలుస్తుంది. ఆ వ్యక్తి మురికి నీటిలో ఉన్న భారీ అనకొండ తలను కచ్చితంగా గుర్తించి.. తన నైపుణ్యంతో వట్టి చేతులతో జాగ్రత్తగా పట్టుకున్నాడు. అతని చేతుల్లో ఎలాంటి కర్ర కానీ, మరే ఇతర వస్తువులు లేకుండా అనకొండాను ఈజీగా పట్టేశాడు. అనకొండ పట్టిన తర్వాత అతనికి సాయంగా మరో ఇద్దరు వ్యక్తులు పామును పట్టుకున్నారు.
ALSO READ: HVF Notification: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 జాబ్స్.. మంచివేతనం.. ఇంకా 2 రోజులే!
అయితే.. అతను ఆ పామును పట్టుకున్న విధానం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే మురికి నీటిలో పామును గుర్తించి పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది సవాలుతో కూడుకున్న పని. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఆ మురికి నీటిలో పాము తలను ఎలా గుర్తించి పట్టుకున్నావ్ బ్రో.. నువ్వు గ్రేట్’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అతని ధైర్య సాహాసాన్ని ప్రశంసించారు. ‘ఆయన పట్టుకున్న విధానం చూస్తుంటే అనకొండకు ఎలా అనిపించిందో’ అని రాసుకొచ్చాడు. అయితే కొంత మంది అతని పామును పట్టే నైపుణ్యం, ధైర్యాన్ని ప్రశింసిస్తుంటే.. మరి కొందరు ఇలాంటి ప్రమాదకరమైన పనులను చేయకూడదని ఖండిస్తున్నారు. ‘ఆ పాము తల సరిగ్గా గుర్తించుకుంటే.. ప్రాణాలకే ప్రమాదం’ అని కొంత మంది కామెంట్ చేశారు.
ALSO READ: Railway Jobs: పది పాసైతే చాలు.. రైల్వేలో జాబ్, జస్ట్ అప్లై చేస్తే ఉద్యోగం భయ్యా
ప్రపంచంలో అతిపెద్ద పాము జాతులలో అనకొండ ఒకటి. దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్‌లో ఈ పాములు నివసిస్తాయి. ఈ పాములు 30 అడుగుల పొడవు, 500 పౌండ్ల బరువు వరకు పెరగగలవు. అవి గ్రీన్ రంగు, వెనుక భాగంలో నల్లని చారలతో కలిసి జలాశయాలు, చిత్తడి ప్రాంతాల్లో దాగి ఉండటానికి సహాయపడతాయి. ఈ పాములు విషం లేనివి, కానీ తమ బలమైన శరీరాలతో ఎలాంటి జీవాలను అయినా చుట్టి ఊపిరాడకుండా చేస్తాయి. అవి పక్షులు, జింకలు, నక్కలు, అడవిలోని ఇతర జీవాలను కూడా ఆహారంగా తీసుకుంటాయి.