Sreeleela: పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల. తన మొదటి సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఈ సినిమా తరువాత శ్రీ లీలకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక రవితేజతో(Raviteja)కలిసి నటించిన ధమాకా (Dhamakha)సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులో కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే తదుపరి నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.
బాలీవుడ్ హీరోతో డేటింగ్..
ప్రస్తుతం శ్రీ లీల సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే అవకాశాలు వచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నారు అంటూ ఒక వార్త సంచలనంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో కలిసి ఇటీవల కాలంలో శ్రీ లీల కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రీ లీల ఎక్కడ స్పందించలేదు. ఇక ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసేలా కార్తీక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
రెస్టారెంట్ లో జంటగా..
తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అంటూ కార్తీక్ తల్లి చెప్పడంతో కచ్చితంగా ఈమె శ్రీ లీలను ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతుంది. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నప్పటికీ ఆమె డాక్టర్(Doctor) చదువు చదువుతున్న విషయం మనకు తెలిసిందే. దీంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అంటూ అందరూ భావించారు. తాజాగా శ్రీ లీల నటుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి కనిపించడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈమె కార్తీక్ తో కలిసి ముంబైలోని బాంద్రా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియో వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link
ఇలా వీరిద్దరూ కలిసి ఒకేసారి బయటికి రావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉండడం నిజమేనంటూ మరోసారి నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. ఇక శ్రీ లీల కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. శ్రీ లీల రవితేజతో కలిసి మాస్ జాతర(Mass Jathara) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటి రెడ్డి జూనియర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో కూడా శ్రీ లీల ఎంతో బిజీగా ఉన్నారు. శ్రీ లీల చివరిగా తెలుగులో రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఈమెకు తీవ్ర నిరాశను కలిగించింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రవితేజ సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారని చెప్పాలి.
Also Read: అయ్యయ్యో.. ఆ డైరెక్టర్ ను గుర్తించండయ్యా.. అనుదీప్ కు ఘోర అవమానం!