Punjabi Crime Thriller: పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘ది గ్రేట్ పంజాబ్ రాబరీ’ (The Great Punjab Robbery). రొటీన్ దోపిడీ కథలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముగ్గురు దొంగలు బ్యాంకును టార్గెట్ చేయడం, ఎలాంటి డిమాండ్లు చేయకుండా పోలీసులనే అయోమయంలో పడేయడం ఈ సినిమా ప్రత్యేకత. అక్రమంగా డబ్బు సంపాదించడం దగ్గర మొదలయ్యే ఈ కథ… పోలీసులకు, దొంగలకు మధ్య జరిగే మైండ్ గేమ్‌గా మారుతుంది. మరి ఈ మైండ్ బ్లోయింగ్ హీస్ట్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.
దొంగతనం అంటే డబ్బు లేదా విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి తప్పించుకోవడాన్ని మనం చూస్తుంటాం. కానీ ‘ది గ్రేట్ పంజాబ్ రాబరీ’లో ముగ్గురు దొంగలు ఫాలో అయ్యే పద్ధతి మాత్రం పోలీసులను కూడా ఆలోచనలో పడేస్తుంది. పంజాబ్‌లోని ఒక బ్యాంకును టార్గెట్ చేసిన ఈ ముగ్గురు… అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అంటే బ్యాంకులో ఉన్న వాళ్ళను బంధిస్తారు.
ఈ దోపిడీలో మరో కీలకమైన అంశం ఏంటంటే… దొంగలు డబ్బు కోసం ఎలాంటి డిమాండ్లు చేయరు. సాధారణంగా దోపిడీ జరిగినప్పుడు నిందితులు తమ డిమాండ్లను తెలియజేయడం, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి మరోలా ఉంటుంది. దొంగలు పోలీసులకు అంతుచిక్కని చిక్కుముడులతో కూడిన సందేశాలు పంపిస్తారు. ఆ సందేశాల్లోని అర్థాన్ని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించే కొద్దీ కేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.
ఒక్కో చిక్కుముడి వెనుక ఒక రహస్యం దాగి ఉంటుంది. దొంగలు అసలు ఏం సాధించాలని అనుకుంటున్నారు ? వాళ్ళు చేసే ఈ పని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ? పోలీసులకు పంపిస్తున్న సందేశాలు దర్యాప్తును సరైన దారిలోకి తీసుకెళ్తాయా ? లేక మరింత గందరగోళానికి గురిచేస్తాయా ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
‘ది గ్రేట్ పంజాబ్ రాబరీ’ ప్రస్తుతం కేబుల్‌వన్ (KableOne) ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది పంజాబీ భాషలో తెరకెక్కిన క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు. దోపిడీ కథల్లో కొత్తదనం, పోలీసులకు నేరగాళ్లకు మధ్య జరిగే మైండ్ గేమ్స్ ను ఇష్టపడేవారు ఈ సినిమాను డోంట్ మిస్. రాజ్ కుంద్రా, పాయల్ రాజ్‌పుత్, గర్విత సధ్వాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సౌరభ్ వర్మ దర్శకత్వం వహించారు.
Read Also: నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు