Indian Army: భారత సైన్యానికి కొత్త ఆయుధాలు రాబోతున్నాయి. కొత్త ఆయుధాల తయారీ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- DRDO, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మధ్య రూ.2,000 కోట్ల విలువైన డీల్ కుదిరింది. దీని ద్వారా సైన్యానికి కొత్త ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం సైన్యం స్టెర్లింగ్ కార్బైన్ గన్‌లను ఉపయోగిస్తున్నాయి. వాటి స్థానంలో సరికొత్తగా 5.56×45 mm క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్-CQB కార్బైన్ మెషిన్ గన్‌లను రాబోతున్నాయి. ఈ ఒప్పందం రక్షణ రంగంలో స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించే ఆత్మనిర్భర్ కార్యక్రమానికి ఇదొక మైలురాయి. DRDOకి చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్- పుణేలో ఈ CQB కార్బైన్‌ను రెడీ చేయనుంది.
వీటిని భారత్ ఫోర్జ్‌కి అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేయనుంది. ఈ కార్బైన్ మెషిన్ గన్స్.. యుద్ధాలు, ఉగ్రవాద నిరోధక చర్యల దాడులకు అనువైనవిగా రూపొందించ నున్నారు. ఈ గన్ తేలికైనది, లక్ష్యాలను టార్గెట్ చేసి కొడితే ఎలాంటివారైనా తోక ముడచాల్సిందే. మోడ్రన్ గన్స్ యుద్ధానికి తగ్గినట్టుగా ఉండనున్నాయి.
డీల్ వల్ల సైన్యానికి 4,25,213 కార్బైన్ గన్స్ రానున్నాయి. INSAS రైఫిల్‌ల ప్రవేశం తర్వాత రక్షణ రంగంలో స్వదేశీ ఆయుధ ఒప్పందం కుదరలేదు. చాన్నాళ్లు తర్వాత ఇప్పుడు కుదిరిందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్ ఫోర్జ్ సంస్థకు దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కీలకమైన అవకాశం దక్కింది.
ALSO READ: మన దేశం గొప్పతనం తెలిసింది.. కన్నీళ్లతో దండం పెడుతూ
1940ల్లో రూపొందించిన స్టెర్లింగ్ గన్‌లు ఇప్పుడు అవసరాలకు సరిపోదని భావించింది రక్షణ రంగం. ఉగ్రవాద నిరోధక సమయంలో ఫెయిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ లోటును క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్-CQB కార్బైన్ మెషిన్ గన్స్ పూర్తి చేయనుంది. ప్రస్తుతం సైన్యానికి దాదాపు 3,50,000 కార్బైన్ గన్స్ అవసరం కాగా, అంతకంటే ఎక్కువే తయారుచేసేలా డీల్ జరిగింది.
ఈ డీల్ భవిష్యత్తులో స్వదేశీ ఆయుధ కార్యక్రమాల్ని ప్రోత్సహించేందుకు ఓ అడుగు ముందుకు పడింది. భారత రక్షణ రంగంలో ప్రైవేటు పాత్రను పెంచనుంది. భారత్ ఫోర్జ్ గతంలో ఆర్టిలరీ గన్‌లు, డ్రోన్‌లను తయారు చేసిన విషయం తెల్సిందే. కొత్త ఒప్పందం ద్వారా ఈ కంపెనీ తన టెక్నాలజీ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోనుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది.
Significantly boosting #atmanirbharta in critical technology, 5.56×45 mm CQB Carbine, designed and developed by Armament Research and Development Establishment(ARDE), DRDO and produced by @BharatForgeLtd selected as L1 in #IndianArmy RFP pic.twitter.com/x7AoFxHT4i
— DRDO (@DRDO_India) June 23, 2025