BigTV English

Jasprit Bumrah : రేసు గుర్రంలా రంకెలేస్తావనుకుంటే.. మాంచెస్టర్ లో ఇండియాను ముంచేశావుగా..!

Jasprit Bumrah :  రేసు గుర్రంలా రంకెలేస్తావనుకుంటే.. మాంచెస్టర్ లో ఇండియాను  ముంచేశావుగా..!

Jasprit Bumrah :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా 4వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 358 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియాను ఇంగ్లాండ్ బౌలర్లు 358 పరుగులకే కట్టడి చేయగా.. ఇంగ్లాండ్ ను మాత్రం భారత బౌలర్లు కట్టడి చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా తన పాత ఫామ్ ను కొనసాగించడంలో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇప్పటివరకు 28 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 95 పరుగులు సమర్పించుకొని కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంలో బుమ్రా పూర్తిగా విఫలమయ్యాడు. దీని కారణంగా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ కి 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.


Also Read :   Tim David : ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. మూడు ఓవర్లలో ఆస్ట్రేలియా 71 రన్స్

ఆశ్యర్యం కలిగిస్తున్న బుమ్రా బౌలింగ్.. 


ఇక టీమిండియా కీలక బౌలర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ వేగాన్ని చూసినా అందరూ ఆశ్యర్యపోతున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అతను 173 బంతుల్లో ఒక్క బంతికి మాత్రమే వికెట్ తీయగలిగాడు. ఆ తరువాత అతను ఇప్పటివరకు మాంచెస్టర్ లో అసమర్తుడిగా మారాడు. మాంచెస్టర్ టెస్ట్ లో బుమ్రా తన ఫామ్ ని కొనసాగించలేకపోతున్నాడు. ఇక బుమ్రా అలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అతను ఇప్పటివరకు 173 బంతులు బౌలింగ్ చేశాడు. అందులో ఒక వికెట్ మాత్రమే లభించింది. ఈ సమయంలో మరో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. ఇది టీమిండియా ఇబ్బందులను మరింతగా పెంచింది. మాంచెస్టర్ లో బుమ్రా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఒక బంతిని మాత్రమే బౌలింగ్ చేశాడు.

బుమ్రా ఆడితే.. టీమిండియాకి ఓటమేనా..? 

ఈ టెస్ట్ మ్యాచ్ లో అతని వేగం 140 కంటే తక్కువగా ఉంది. దీని కారణంగా ఇప్పటి వరకు ఈ టెస్ట్ మ్యాచ్ లో వికెట్లు తీయలేకపోయాడు. ఇది అతని ఫిట్ నెస్ పై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎందుకంటే.. సాధారణంగా బుమ్రా ఫిట్ గా ఉంటే.. అతను 140 కంటే ఎక్కువ బౌలింగ్ చేస్తాడు. కానీ గతంలో లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో ఇలాంటిదే కనిపించింది. కానీ మాంచెస్టర్ లో అంతగా ఫిట్ గా లేనట్టు కనిపిస్తోంది. అందుకే బుమ్రా అంతగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. వాస్తవానికి బుమ్రా కి రెస్ట్ ఇవ్వాల్సింది. కానీ కీలక బౌలర్లు అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్ దీప్, నితీశ్ రెడ్డి వంటి వారు గాయాల పాలవ్వడంతో బుమ్రా కచ్చితంగా బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక లీడ్స్ లో జరిగిన తొలి మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండో టెస్టులో బుమ్రా ఆడలేదు. ఆ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్టులో 7 వికెట్లు తీశాడు. కానీ ఆ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. బుమ్రా ఆడకుంటేనే టీమిండియా విజయాలు సాధిస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపించడం విశేషం.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×